iDreamPost
iDreamPost
2019లో మజిలీ, ఓ బేబీ సూపర్ హిట్ల తర్వాత 2020 జాను డిజాస్టర్ తో ఏడాది దాకా గ్యాప్ తీసుకున్న సమంతా లాక్ డౌన్ టైంలోనూ ఏ కొత్త సినిమాలను ప్రకటించలేదు. తమిళంలో సూపర్ డీలక్స్ పేరు తెచ్చినప్పటికీ వేరే ఆఫర్లను ఒప్పుకోలేదు. తాజాగా ఆహా కోసం సామ్ జామ్ టాక్ షో నడిపిస్తున్న తీరు బాగానే ప్రశంసలను తెచ్చి పెడుతోంది. అందరూ పేరున్న సెలబ్రిటీలు రావడంతో రెస్పాన్స్ బాగా వస్తున్నట్టు ఓటిటి టాక్. ఇదిలా ఉండగా నిన్న గుణశేఖర్ తన ‘శకుంతలం’ హీరోయిన్ గా సమంతా పేరునే ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హిరణ్యకశిపను బడ్జెట్ కారణాల వల్ల వాయిదా వేసి ముందుగా శకుంతలంను పూర్తి చేయబోతున్నారు.
కెరీర్లో కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేనప్పటికీ సమంతాకు ఈ శకుంతల పాత్ర ఛాలెంజ్ లాంటిది. అయితే గుణశేఖర్ దీన్ని ఇతిహాస గాధగా రూపొందించబోతున్నాడా లేక వర్తమానాన్ని కలిపి ఏదైనా ఫాంటసీ మిక్స్ చేయబోతున్నాడా లాంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ విజువల్ వండర్ కు బడ్జెట్ కూడా భారీగానే కేటాయించబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రకటించబోతున్నారు. అనుష్కకి రుద్రమదేవి రూపంలో మర్చిపోలేని క్లాసిక్ ఇచ్చిన గుణశేఖర్ సమంతకు కూడా అలాంటి బ్రేక్ ఇస్తారని అభిమానుల నమ్మకం. స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయ్యిందట.
దీని కన్నా ముందు సమంతాను ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో నెగటివ్ క్యారెక్టర్ లో ఫ్యాన్స్ చూడబోతున్నారు. ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కు ప్లాన్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ ఈ నెలలలోనే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతోంది. సుదీర్ఘమైన సిరీస్ కాబట్టి సామ్ పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. లేడీ టెర్రరిస్ట్ గా ఎవరూ ఊహించని క్యారెక్టర్ లో సర్ప్రైజ్ చేయడం ఖాయమని ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా మయూరి, గేమ్ ఓవర్ ఫేమ్ ‘అశ్విన్ శరవణన్’ డైరెక్షన్ లో ఓ థ్రిల్లర్ చేస్తున్న సమంత దాంతో పాటు ‘విగ్నేష్ శివన్’ రూపొందించే మరో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. సో రానున్న రెండేళ్లకు సమంతా డైరి చాలా బిజీగా ఉండబోతోంది