iDreamPost
android-app
ios-app

నిన్న చిరు రేపు చరణ్ – సల్మాన్ సూపర్ ప్లాన్

  • Published Jun 21, 2022 | 4:07 PM Updated Updated Jun 21, 2022 | 4:07 PM
నిన్న చిరు రేపు చరణ్ – సల్మాన్ సూపర్ ప్లాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సౌత్ స్టార్ హీరోలతో కాంబోలు చేయాలని మంచి ఉత్సాహంగా ఉంది. అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యామియో అడగ్గానే నసగడం లాంటివి లేకుండా ఎస్ చెప్పేశాడు. అంతేకాదు రెమ్యునరేషన్ పైసా తీసుకోకుండా కాల్ షీట్లు ఇచ్చాడు. త్వరలోనే చిరు సల్మాన్ ల కాంబినేషన్ లో తమన్ ట్యూన్ కి కలిసి డాన్స్ చేయించబోతున్నాడు దర్శకుడు మోహన్ రాజా. కబీ ఈద్ కభీ దివాలిలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డేకు తను అన్నయ్యగా నటించవచ్చని ముంబై మీడియా రిపోర్ట్. సల్మాన్ వెంకీల మధ్య కాంబినేషన్లు సీన్లు చాలా బాగా రాబోతున్నాయని వినికిడి.

ఇంతే కాదు ఇదే సినిమాలో రామ్ చరణ్ తో ఒక స్పెషల్ క్యామియో చేయించే ప్రతిపాదనకు మెగా పవర్ స్టార్ ఆల్మోస్ట్ ఓకే చెప్పినట్టు సమాచారం. తన తండ్రి కోసం అడగ్గానే గాడ్ ఫాదర్ చేసిన సల్మాన్ కు ఈ మాత్రం చేయడం ధర్మమని చరణ్ ఫీలయ్యాడట. అంతే కాదు వెంకీ, సల్మాన్ తో కలిసి తనకు ఓ పాట కూడా డిజైన్ చేయబోతున్నట్టు తెలిసింది. మొత్తానికి చాలా ఎగ్జైటింగ్ న్యూస్ ఇది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కి శ్రీరాముడి గెటప్ లో నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దాని వల్లే తన మార్కెట్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు సల్మాన్ మూవీలో డైరెక్ట్ రీ ఎంట్రీ ఇవ్వడమంటే ఫ్యూచర్ లో చేసే ప్యాన్ ఇండియా మూవీస్ కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యేదే.

ఇప్పటికైతే ఇది అఫీషియల్ నోట్ రాలేదు కానీ దాదాపు ఒకే అయినట్టే. సల్మాన్ ఖాన్ సినిమా ప్రేమ్ రతన్ ధన్ పాయోని గతంలో తెలుగు డబ్బింగ్ చేసినప్పుడు అందులో సల్లు భాయ్ కి గొంతు ఇచ్చింది చరణే. పైగా రెండు కుటుంబాలు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈ స్నేహభావంతో పరస్పరం పాత్రలు ఇచ్చి పుచ్చుకునే ట్రెండ్ ని మొదలుపెట్టారు. జంజీర్ టైంలో నటన, ఎక్స్ ప్రెషన్స్ పరంగా చాలా విమర్శలు ఎదురుకుని ఇప్పుడు ట్రిపులార్ తర్వాత వచ్చిన రామ్ చరణ్ ని దగ్గరనుంచి గమనించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు తనని కభీ ఈద్ లో తీసుకోవడం ఇక్కడి మార్కెట్ పరంగానూ పెద్ద ప్లస్సే. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş