ఆర్టీసీ సమ్మె విరమణ లో నెలకొన్న సందిగ్ధం కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. ఉద్యోగం పోతుందనే ఆందోళన తో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా బుధవారం ముషీరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ కైలాష్ గత రాత్రి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉద్యోగం పోతుందనే మానసిక వేదనతోనే కైలాష్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు ప్రాధమిక సమాచారం. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని ముషీరాబాద్ ఫ్రెండ్స్ కాలనీ ఆయన ఇంటికి తరలించారు. కార్మికుల సమ్మె 26వ రోజుకు చేరుకుంది.