Idream media
Idream media
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం తో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆర్టీసీ మూసివేతే పరిష్కారమని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. నష్టాల బాటలో ఉన్న సంస్థను పునరుద్ధరించడం అసాధ్యమని తేల్చిచెప్పిన కేసీఆర్.. సమ్మె విష యంలో యూనియన్లు, రాజకీయ పార్టీల తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ కార్యా లయం తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎంచుకున్నది పిచ్చి పంథా. అనవసరమైన అర్థం పర్థంలేని దురహంకార చర్య’ అని సీఎం విమర్శించారు. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అసంభవమని, సంస్థను కాపాడటం వెయ్యి శాతం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
‘ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అర్థ రహిత, అసంబద్ధ, తెలివితక్కువ నిర్ణయం. పనికి మాలిన, తల మాసిన రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడటం విడ్డూరం. పది మంది కనపడితే చాలు.. జెండా పట్టుకొని కూర్చుంటున్నారు. అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? ప్రతి పక్షా లకు బాధ్యత లేదా? వేతనాలను 67 శాతం పెం చిన తర్వాత కూడా డిమాండ్లు పెట్టడం తమా షానా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీ నామమాత్రంగా మారిందని, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో ఆర్టీసీ లేదని, కమ్యూ నిస్టులు 35 ఏళ్లు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 10 కోట్ల జనాభాకు కేవలం 200 బస్సులు మాత్రమే ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసిందని గుర్తుచేశారు.