iDreamPost
android-app
ios-app

RRR రేపే వస్తున్నారు : అఫీషియల్

  • Published Mar 24, 2020 | 2:08 PM Updated Updated Mar 24, 2020 | 2:08 PM
RRR రేపే వస్తున్నారు : అఫీషియల్

కరోనా ప్రభావం వల్ల నీరసపడిపోయిన సినిమా ప్రేమికులకు రాజమౌళి టీమ్ స్వీట్ షాక్ ఇవ్వబోతోంది. టైటిల్ ని రివీల్ చేస్తూ రేపు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నామని ఇందాకే ప్రకటించారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అగ్గిరవ్వలు చిమ్ముతున్న చేయి ఒకవైపు, నీటి హోరును వదులుతున్న మరో చేయి ఇంకోవైపు చూపించి ఆ ఇద్దరూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పకనే చెప్పారు. మొత్తం బాగానే ఉంది కానీ టైం మాత్రం అందులో పేర్కొనలేదు.

రేపు ఇద్దరు హీరోల అభిమానులు వచ్చే దాకా వెయిటింగ్ చేయాల్సిందే. ఇప్పటికే రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్ అని ప్రచారంలో ఉన్నాయి కానీ రేపు వీటిలో ఒకటి ఖరారు చేస్తారా లేదా ఇంకేదైనా షాక్ ఇస్తారా చూడాలి. చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ని లాంఛనంగా ప్రారంభించబోతున్న రోజే ఇదీ రిలీజ్ కావడం కాకతాళీయమో లేక ప్లాన్ చేసుకున్నారో ఇప్పటికైతే తెలియదు. రేపు ఆచార్య ఫస్ట్ లుక్ వస్తుందని ఎదురు చూస్తుండగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి అప్డేట్ రావడం విశేషమే.

హీరోయిన్ అలియా భట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటిదేమి ఉండకపోవచ్చని ఇన్ సైడ్ టాక్ సైడ్. అజయ్ దేవగన్, సముతిర ఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్ఆర్ఆర్ కు కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8ని రిలీజ్ డేట్ గా లాక్ చేశారు. ఇప్పటికే అనౌన్స్ చేసినా మరోసారి అఫీషియల్ గా మోషన్ పోస్టర్ లోనూ చెప్పే ఛాన్స్ ఉంది. చూద్దాం.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞjojobetjojobet girişgamdomgrandpashabetCasibomjojobet girişholiganbet girişMarsbahis