iDreamPost
android-app
ios-app

దొంగాపోలీస్ ఆడుతున్న RRR టీం

  • Published Mar 27, 2020 | 5:05 AM Updated Updated Mar 27, 2020 | 5:05 AM
దొంగాపోలీస్ ఆడుతున్న RRR టీం

ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఇప్పటికే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అభిమానులు హంగామా చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ ఒక స్పెషల్ RRR వీడియో పోస్ట్ చేస్తానని ట్విట్టర్ వేదికగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన టైం ఉదయం పది గంటలు కావడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూసి వీళ్ళ ఎకౌంట్లు ఓపెన్ చేసి చూశారు. తీరా చూస్తే అందులో ఎలాంటి వీడియో లేదు.

తారక్ చరణ్ కు సారీ చెబుతూ రాజమౌళికి వీడియో రాత్రే పంపానని ఆయన గురించి నీకు తెలిసిందే కదా కొంచెం లేట్ అవుతుందని ట్వీట్ చేశాడు. ఈలోగా ఉదయాన్నే యాక్టివ్ అయిపోయిన చిరంజీవి ఐ యాం వెయిటింగ్ అంటూ చిన్న క్లిప్ ఒకటి పోస్ట్ చేశారు. దెబ్బకు రాజమౌళి లైన్ లోకి వచ్చేశాడు. సార్ సార్ ప్లీజ్ అది కొంచెమే లేట్ ఏమనుకోకండి అని అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చాడు. మరోవైపు రాజమౌళి వారసుడు ఎస్ఎస్ కార్తికేయ అసలు ఎందుకు లేట్ అవుతోందని తారక్ కు రీ ట్వీట్ పెట్టాడు. ఇదంతా అయ్యాక చరణ్ వచ్చేశాడు.

ఏంటి ఆయనకు పంపావా, అసలు ఈ రోజు నాకు అది అందుతుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టడంతో ఫన్ కాస్తా పీక్స్ కు వెళ్లిపోయింది. వీళ్ళందరిని ఫాలో అవుతున్న ఫాన్స్ మాత్రం వీడియో ఎప్పుడు వస్తుందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. కాని కామెంట్స్ లో మాత్రం మంచి కామెడీని ఇస్తున్నారు. ఒక వీడియో కోసం ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూస్తుంటే ఇలా ఒకరికొకరు కారణం చెప్పకుండా దొంగా పోలీస్ ఆడుతున్నారని నెటిజెన్లు సరదాగా అంటున్నారు. మొత్తానికి తారక్-చిరంజీవి-రాజమౌళి-కార్తికేయ- చరణ్ ఇలా ఒక చైన్ రూపంలో ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ ఎంటర్ టైన్మెంట్ బాగానే సాగుతోంది కాని ఇంతగా ఊరిస్తున్న ఆ అసలు వీడియోలో ఏముందో బయటికి వస్తే కాని అర్థం కాదు. 

marsbahis girişjojobetjojobet girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet giriş