iDreamPost
android-app
ios-app

RRR : 30 రోజుల RRR కౌంట్ డౌన్ షురూ

  • Published Dec 07, 2021 | 6:07 AM Updated Updated Dec 07, 2021 | 6:07 AM
RRR : 30 రోజుల RRR కౌంట్ డౌన్ షురూ

రాజమౌళి సినిమా తీసినా ప్రమోషన్ చేసినా అదో లెవెల్ లో ఉండాల్సిందే. గ్రాండియర్ అనే పదానికి పబ్లిసిటీలోనూ మార్క్ చూపించే ఈ ఆధునిక జక్కన్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది హైప్ ని పెంచే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. నిజానికి దీనికంత హడావిడి అక్కర్లేదు. కానీ విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టే ఆలోచనలో రాజమౌళి లేరు. దానికి తగ్గట్టే ఎల్లుండి అంటే 9న విడుదల కాబోతున్న ట్రైలర్ కోసం ఏకంగా వందలాది థియేటర్లను సిద్ధం చేసి ఉంచడం చూస్తే ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. దాదాపుగా అన్ని సెంటర్లలో భారీ ఎత్తున ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.

ప్రధాన కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, అభిషేకాలు, గుళ్లో పూజలు, ఊరంతా బ్యానర్లు ఇలా ఇద్దరు హీరోల అభిమానులు చేస్తున్న రచ్చ పోటాపోటీగా కనిపిస్తోంది. ఉదయం సరిగ్గా 10 గంటలకు ట్రైలర్ ని స్క్రీనింగ్ చేస్తారు. దాదాపు అన్ని చోట్ల ఫ్రీ ఎంట్రీనే ఉంటుంది. దానికి సంబంధించి పాసులు కూడా ఇచ్చేశారు. రెండు మూడు సార్లు వేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. మూడు నిమిషాలకు దగ్గరలో ఉన్న ట్రైలర్ లో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఈ కారణంగానే యుట్యూబ్ వెర్షన్ ని కొంత ఆలస్యంగా వదిలే అవకాశాలు ఉన్నాయి. టీమ్ చెప్పడం బట్టి చూస్తే కనీసం గంట గ్యాప్ ఉండొచ్చు.

విడుదలకు సరిగ్గా నెల రోజులే ఉన్న నేపథ్యంలో అందరి దృష్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై వెళ్తోంది. 17న పుష్ప వచ్చాక ఆర్ఆర్ఆర్ సందడి ఇంకా పెరగనుంది. అఖండ కలెక్షన్లు నమ్మకాన్ని ఇచ్చాయి కాబట్టి పాన్ ఇండియా సినిమాలకు మార్గం సుగమం అయినట్టే. కాకపోతే ఓమీక్రాన్ వైరస్ తాలూకు టెన్షన్ నిర్మాతల్లో లేకపోలేదు. టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే బిగ్గెస్ట్ రిలీజ్ అందుకోబోతున్న ఆర్ఆర్ఆర్ ఎన్ని స్క్రీన్లలో విడుదల కాబోతోందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్క యుఎస్ లోనే పది వేలకు పైగా స్క్రీనింగ్ ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి మార్కెటింగ్ లో తనను మించిన వారు లేరని రాజమౌళి ఋజువు చేస్తూనే ఉన్నారు

Also Read : Boyapati Srinu : మెగాస్టారా ఐకాన్ స్టారా – ఎవరితో సినిమా

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritking giriş