iDreamPost
iDreamPost
రాను రాను కొత్త సినిమాల విడుదల తేదీలు ఎంత సంక్లిష్టంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పది నెలల లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో అందరూ డేట్ల కోసం ఎగబడి ఇంకా షూటింగ్ జరుగుతుండగానే కర్చీఫ్ లు వేసేస్తున్నారు. ఇది అన్ని భాషల్లోనూ జరుగుతున్నదే అయినప్పటికీ తెలుగులో ఏకంగా 35 దాకా సినిమాలు రిలీజులు ఫిక్స్ చేసుకోవడం మాత్రం ఇప్పుడు ఎక్కడా లేని అరుదైన రికార్డు. ఇదిలా ఉండగా కన్నడకూ ఇక్కడి పరిణామాల సెగలు తాకుతున్నాయి. కెజిఎఫ్ తర్వాత ఇప్పుడిప్పుడే మన మార్కెట్ మీద కన్నేసిన శాండల్ వుడ్ హీరోలు తమ డబ్బింగులకు భారీ విడుదలను కోరుకుంటున్నారు.
అర్థం కాలేదా. డీటెయిల్స్ లోకి వెళదాం. వచ్చే నెల మార్చి 11న తెలుగులో శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్ వస్తున్నట్టు ఆయా ప్రొడ్యూసర్లు ఇప్పటికే అఫీషియల్ గా పోస్టర్లు కూడా వదిలేశారు. మంచు విష్ణు మోసగాళ్లు కూడా రావొచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇవన్నీ స్ట్రెయిట్ మూవీస్. ఇవి కాకుండా కన్నడ డబ్బింగ్ రాబర్ట్ కూడా అదే తేదీకి లాక్ చేసుకుంది. శివరాత్రి పండగతో పాటు వరస సెలవులు ఉండటంతో అందరూ ఆ అవకాశాన్ని వాడుకునేందుకు డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఇన్నేసి సినిమాలకు కావాల్సినన్ని థియేటర్లు సర్దడం అంటే చిన్న విషయం కాదు.
దీని గురించే రాబర్ట్ హీరో దర్శన్ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు తన సినిమాకు సరిపడినన్ని స్క్రీన్లు ఇవ్వకుండా చేస్తున్నారని ఏకంగా అక్కడి ఫిలిం ఛాంబర్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీని వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమి లేకపోయినా దర్శన్ మిస్ అవుతున్న లాజిక్ ఒకటుంది. ఇక్కడ తనకు ఇమేజ్ లేదు. కర్ణాటకలో స్టార్ హీరోగా యాభై సినిమాలు చేసినప్పటికీ మన ప్రేక్షకులకు ఇతని గురించి తెలిసింది చాలా తక్కువ. అప్పుడెప్పుడో ఒకటి రెండు డబ్ చేశారు కానీ ఒక్కటి కూడా ఆడలేదు. అలాంటప్పుడు తనకు ఎక్కువ థియేటర్లు కావాలని అందులోనూ తెలుగు సినిమాలు మూడు నాలుగు రేస్ లో ఉన్నప్పుడు పోటీ పడాలనుకోవడం న్యాయం కాదు కదా. అయితే ఇక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ డీసెంట్ రిలీజ్ దక్కేలా చేస్తామని హామీ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్