కాంగ్రెస్-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసే లేదు. డైలీ ఏదో ఒక పార్టీ వారు ప్రెస్ మీట్ పెట్టి ఎదుటి పార్టీపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఈ విమర్శల సీరియల్లోకి రెండు పార్టీల నాయకులు ఎంట్రీ కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇరు పార్టీల నేతల బూతు పురాణాలు లంకించుకుంటున్నారు. ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్న నాయకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సవాళ్లు, ప్రతిసవాళ్లు, రాజీనామా డిమాండ్లతో మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి అక్రమంగా సంపాదించిన భూముల లెక్కలను వివరించాడు. మంత్రి మల్లారెడ్డి.. 50 ఎకరాల లే ఔట్ చేసిన వ్యాపారిని బెదిరించినట్లుగా ఆధారాలు బయటకు వచ్చాయని.. దీనితో పాటు ఆడియో టేపులు కూడా వెలుగుచూశాయని… అలాగే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నట్లుగా ఆడియోలు బయటకు వచ్చాయని ఆయన ఆరోపించారు.
గుండ్లపోచంపల్లిలో సర్వేనెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉందని, ఈ భూమి ఒక్కసారిగా ధరణి పోర్టల్‌కు వచ్చేసరికి 33 ఎకరాల 26 గుంటలుగా మారిందని అన్నారు. న్యాక్ గ్రేడింగ్ కోసం పెట్టిన పత్రాలన్ని పోర్జరీ పత్రాలని, 5 ఏళ్లు న్యాక్ నిషేధించిందన్నారు. 420 కింద జైల్లో వేయాల్సిన మల్లారెడ్డిని మంత్రిని చేసిన ఘనత కేసీఆర్‌దేనని దుయ్యబట్టారు.
ఈ మాటల యుద్ధం ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా మంత్రుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ కేసీఆర్ వైపు తిరిగింది. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేశాడని ఈటెల రాజేందర్ మీద ఎంత స్పీడ్ గా చర్యలు తీసుకున్నారో అంతే స్పీడుగా మల్లారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. అవినీతి ఆరోపణలు వస్తే రాజయ్య, ఈటెలకు ఒక న్యాయం మల్లారెడ్డికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read : సీఎంలను మార్చే కాంగ్రెస్ సంస్కృతికి ముగింపే లేదా?
మల్లారెడ్డిని వెనుకేసుకువచ్చిన కేటీఆర్..
నిన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తీవ్రస్థాయిలో విరుచుకబడ్డ మంత్రి మల్లారెడ్డికి కేటీఆర్ కూడా వంత పాడడం విశేషం. రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి చేసిన ఆరోపణలు, పరుష పదజాలాన్నిటీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించే ప్రయత్నం చేశారు. టిఆర్ఎస్ పార్టీ వారిని రాజీనామా ఆడిగేముందు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లో రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సూచించారు.
రేవంత్ వెనుకాల చంద్రబాబు నాయుడు..
అయితే రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఆసక్తికరమైన విమర్శలు చేశాడు. టీ కాంగ్రెస్ ను చంద్రబాబు ప్రాంఛైజీలా వాడుతున్నారని, పలుకుతున్న చిలక మనదే కానీ పలికించేది మాత్రం చంద్రబాబునాయుడేనని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని ముందు పెట్టి చంద్రబాబు వెనకాల ఆడిస్తున్నాడని, చంద్రబాబు ఆడే తోలుబొమ్మలాటలో రేవంత్ రెడ్డి బొమ్మ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటినుంచైనా రాజకీయ నాయకులు సంస్కారవంతంగా మాట్లాడాలని హితవు పలికారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన..
ఏదేమైనా రేవంత్ రెడ్డి వెనుకాల చంద్రబాబు ఉన్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ మొదలైంది. తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడంతో బాబు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడా అన్న అనుమానం కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలయింది. నిజంగా రేవంత్ రెడ్డికి గత పార్టీ వాసనలు పోలేదా..? ఒకప్పుడు తనకు నమ్మిన బంటుల ఉన్న రేవంత్ వెనుకాల ఇప్పుడు చంద్రబాబు ఉండి నడిపిస్తున్నాడా అన్న అనుమానం మొదలయింది.
Also Read : రేవంత్ కి మల్లారెడ్డికి ఉన్న వైరం ఏంటి..? గతంలో ఒకే పార్టీ లో ఉన్నవారిద్దరికీ ఎక్కడ బెడిసింది..?