iDreamPost
android-app
ios-app

ఇక సచివాలయాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌: ప్రజల ఇబ్బందులకు పరిష్కారం చూపిన జగన్ సర్కార్

ఇక సచివాలయాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌: ప్రజల ఇబ్బందులకు పరిష్కారం చూపిన జగన్ సర్కార్

గ్రామాల్లో భూములు, స్థలాలు వంటివి రిజిస్ట్రేషన్ చేయాలంటే అదో పెద్ద తలనొప్పి వ్యవహారం. మండల కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ సవ్యంగా జరిగేవికావు. ప్రధానంగా రైతులు తమ పనులు ఆపుకొని మండల కేంద్రంలో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యేది. డాక్యుమెంట్లు రాసేవాళ్లు రైతుల వద్ద వేలకు వేలు లాగేవారు.

ఈ డాక్యుమెంట్ రాసేవారు…సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉండేవారు కుమ్మక్కై రైతులు వద్ద వేల రూపాయలు డిమాండ్ ‌చేస్తున్నారు. దీంతో రైతులకు ఒకపక్క సమయం, మరోపక్క వ్యయం అవుతుంది. అయితే వైఎస్ జగన్ వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేందుకు కీలక నిర్ణయాలు చేస్తున్నారు. ప్రజల వద్దకు పాలన అందించేందుకు రచించిన ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

ప్రజలు మరి ముఖ్యంగా రైతుల బాధలను పొగొట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరార చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కాజ సచివాలయం ఎంపికైంది.

ఇక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గత కొద్ది రోజులుగా సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎవరు చేయాలనే అంశంపై ఇటు రిజిస్ట్రేషన్‌, అటు ప్రభుత్వ వర్గాల్లో అయోమయం నెలకొంది.

తాజాగా దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలోనే సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దస్తావేజుకు సంబంధించిన చెక్‌స్లిప్‌లు కొట్టడానికి, మార్కెట్‌ ధరలు పక్కాగా నమోదు చేశారా? లేదా? అనేవి పరిశీలించే పనులకు మాత్రం సచివాలయాల్లోని ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన నెట్‌వర్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.