Idream media
Idream media
మంగళవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ లోపలి పేజీల్లో ఒక చిన్న వార్త . “రీగల్ సినిమాస్” కష్టాల్లో వుందని. రీగల్ అంటే మన దేశంలో పీవీఆర్ , సినీమాక్స్ లాగా గ్రూప్ థియేటర్స్. ఈ థియేటర్ గ్రూప్‌కి 96 ఏళ్ల చరిత్ర వుంది. 1924లో యునైటెడ్ ఆర్టిస్ట్ థియేటర్స్, 1930లో ఎడ్వర్డ్స్ థియేటర్స్ , 1989లో రీగల్ సినిమాస్ ఇలా ఇది రూపాంతరం చెందుతూ వచ్చింది. అమెరికా, ఇంగ్లాండ్ ఇంకా ఎన్నో దేశాల్లో ఒక్క వెలుగు వెలుగుతున్న రీగల్ కరోనాతో అప్పుల పాలైంది. దివాళా నుంచి తప్పించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వుంది. అప్పులు తీర్చుకోడానికి 450 మిలియన్ డాలర్ల కొత్త అప్పు చేసింది.
థియేటర్లలోకి సొంత ఫుడ్ Allow చేయకపోవడం, పాప్‌కార్న్‌ని అదిరిపోయే రేట్లతో అమ్మడం ఇవన్నీ ప్రవేశ పెట్టింది రీగల్ సినిమాలే. 40 వేల ఉద్యోగులు ఇప్పుడు టెన్షన్‌తో వున్నారు. ఎందుకంటే థియేటర్లు Open చేసినా కొత్త సినిమాలు లేవు. సినిమాలు లేకపోతే జనం రావడం లేదు. అందుకని వచ్చే ఏడాది వరకూ మూసివేత ఆలోచనలోనే వున్నారు.
థియేటర్లకి జనం వచ్చే మూడ్ వుంటే తప్ప కొత్త సినిమాలు రావు. సినిమాలు వస్తే తప్ప జనం పల్స్ తెలియదు. మన దేశంలోని చెయిన్ థియేటర్స్ కూడా ఇంచుమించు ఇవే కష్టాల్లో వున్నాయి. ఇక సింగిల్ థియేటర్ల సంగతి ఇంకా అధ్వాన్నంగా వుంది. ఉద్యోగులకి జీతాలు ఎలాగూ ఇవ్వడం లేదు. దాదాపు 9 నెలలుగా మూసి వేయడంతో తిరిగి దాన్ని సిద్ధం చేయాలంటే పెనుభారం. మెయింటెనెన్స్ దెబ్బతినింది.
సినిమా పుట్టినప్పటి నుంచి ఇన్ని సినిమా కష్టాలు ఎపుడు రాలేదు.