iDreamPost
android-app
ios-app

వెంకటేష్ సైలెన్స్ అందుకేనేమో

  • Published Aug 01, 2021 | 7:18 AM Updated Updated Aug 01, 2021 | 7:18 AM
వెంకటేష్ సైలెన్స్ అందుకేనేమో

సీనియర్ హీరోల్లో ఎవరూ చేయని సాహసానికి పూనుకుని నారప్పని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయడం ద్వారా మంచి ఫలితం అందుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ రాబోతున్న సినిమా దృశ్యం 2. కేవలం నలభై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కూడా ఓటిటిలోనే రాబోతోందని నెల రోజులకు పైగా గట్టి ప్రచారం జరిగింది. నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. మొన్న జరిగిన నారప్ప సక్సెస్ మీట్ లో వెంకీ మాట్లాడుతూ సంక్రాంతికి ఎఫ్3తో థియేటర్లలో కలుద్దామని అన్నారే కానీ దృశ్యం 2 గురించి కనీస ప్రస్తావన లేదు. ఒకవేళ డిజిటిల్ రిలీజ్ అనుకున్నా ఆ మాట కూడా చెప్పలేదు.

దీని వెనుక కారణం లేకపోలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దృశ్యం 2ని డిస్నీ హాట్ స్టార్ వచ్చే నెల అంటే సెప్టెంబర్ 9 లేదా 10కి విడుదల చేయాలని ప్లాన్ చేసుకుందట. ఎలాగూ ఈ నెల నితిన్ మాస్ట్రో ఉంది కనక అప్పుడు వెంకీ మూవీకి వినాయక చవితి సందర్భం కూడా కలిసి వస్తుందనే ఆలోచన చేసినట్టు తెలిసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ దృశ్యం 2కి సంబంధించి ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. షూటింగ్ స్పాట్ లో ఉన్న గ్రూప్ ఫోటో కొన్ని వర్కింగ్ స్టిల్స్ తప్ప ఎలాంటి పబ్లిసిటీ మెటీరియల్ వాడలేదు. ఇంకా టైం ఉందని ఆగిపోయారో లేక అంతా హాట్ స్టార్ కే వదిలేశారో తెలియదు

ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. నారప్ప డిజిటల్ రన్ బాగా చల్లబడ్డాకే దృశ్యం 2 ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అది స్ట్రీమింగ్ జరిగి ఇప్పటికి పది రోజులు దాటింది. ఇంకో రెండు వారాలు ఆగి అప్పుడు మొదలుపెడితే కిక్ కొత్తగా ఉంటుంది. లేకపోతే వెంకటేష్ సినిమాలన్నీ ఓటిటిలోనే వస్తున్నాయన్న టాక్ బయట ఇంకోలా వెళ్ళిపోతుంది. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ దృశ్యం 2కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. పాటలు పెట్టారో లేదో క్లారిటీ లేదు. మలయాళంలో అయితే లేవు. ఇక్కడా పెట్టుండకపోవచ్చు. దాదాపు ఫస్ట్ పార్ట్ క్యాస్టింగ్ నే ఇందులో కూడా తీసుకున్నారు

Also Read: సినిమా వసూళ్ల కహాని – ఆశా నిరాశా