‘అల్లరి’ రవిబాబు, తన దర్శకత్వంలో రూపొందే సినిమాల్లోని నటీనటుల్ని వెండితెరపై రొమాంటిక్‌గా ‘క్రష్’ చేయించేస్తుంటాడు. తన తాజా చిత్రం ‘క్రష్’ కోసం ఇంకాస్త ఎక్కువగా ‘ఆ టైపు’ వ్యవహారాల్ని వెండితెరపై చూపించబోతున్నాడనే విషయం తాజా ప్రోమోతో అందరికీ అర్థమయిపోయింది. అడల్ట్ ఫిలింకి ఏమాత్రం తీసిపోనట్లుంది ఈ క్రష్. అడల్ట్ సినిమాల్లో పూర్తి న్యూడ్ వ్యవహారాలుంటాయి.. ఇక్కడ అది కాస్త తక్కువ వుంటుంది. అదే తేడీ. మిగతాదంతా సేవ్‌ు టు సేవ్‌ు అనుకోవాలేమో. ముగ్గురు కుర్రాళ్ళు అమెరికా వెళ్ళాలనుకుంటారు. అమెరికా వెళ్ళాలంటే, శరీరంలో ఏ పార్ట్ ఎందుకు పనిచేస్తుందో తెలుసుకోవాలనీ, సెక్సువల్ లైఫ్‌పై పూర్తి అవగాహన వుండాలనీ, అమెరికా వెళ్ళొచ్చిన ఓ స్నేహితుడు చెప్పిన విషయాల్ని వంటపట్టించుకున్న ఆ ముగ్గురు యువకుల చిలిపి వ్యవహారాలే ఈ ‘క్రష్’. ఓ తండ్రి, తన కొడుక్కి ‘జి స్పాట్’ గురించి తెలియజేయాలనుకోవడం సహా, చాలా విషయాల్ని ఇందులో ‘బోల్డ్’గా ‘కామెడీ’గా చూపించేందుకు రవిబాబు ప్రయత్నించినట్లు కన్పిస్తోంది. అయితే, ఈ తరహా విషయాలపై ఎన్నో షార్ట్ ఫిలింస్స్, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. మరి, వాటికన్నా భిన్నంగా ‘క్రష్’లో ఏముంటుంది.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రవిబాబుకి ఇలాంటి సినిమాలు కొట్టిన పిండి. సో, ఆయన్నుంచి ఈ సారి ఓ సూపర్బ్ కమర్షియల్ ఔట్‌పుట్‌ని ‘ఓ వర్గం ప్రేక్షకులు’ నిస్సంకోచంగా ఆశించెయ్యొచ్చన్నమాట. అందరూ కొత్త నటీనటుల్ని ఎంచుకోవడం రవిబాబుకి అలవాటే, ఈ సినిమాలో కూడా అంతే.