iDreamPost
android-app
ios-app

కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రేమ వేడుక

  • Published Sep 20, 2021 | 5:29 AM Updated Updated Sep 20, 2021 | 5:29 AM
కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రేమ వేడుక

ఈ నెల 24న విడుదల కాబోతున్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ ప్లగ్డ్ పేరుతో చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రధాన ఆకర్షణగా విచ్చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొత్తం చూపు తమవైపే తిప్పేసుకున్నారు. ఇద్దరి కలయిక, పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకోవడం విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో నాగ చైతన్య గురించి అమీర్ ఖాన్ చెప్పిన మాటలు అభిమానులకు కలిగించిన ఆనందం అంతా ఇంతా కాదు. లాల్ సింగ్ చద్దాలో చైతు పెర్ఫార్మెన్స్ చూసి మూడు రోజుల క్రితం తానే అడిగి వస్తానని చెప్పానని, అంతగా అతని వ్యక్తిత్వం ఆకట్టుకుందని ఓపెన్ గా స్టేజి మీదే చెప్పడం చిన్న విషయం కాదు.

ఇక సాయిపల్లవి చిరంజీవిల మధ్య జరిగిన సంభాషణ మొత్తానికే హై లైట్ గా చెప్పుకోవచ్చు. భోళా శంకర్ లో చెల్లిగా నటించేందుకు ఆమెను అడగగా నో చెప్పిందని అలాంటి డాన్సర్ తో నృత్యం చేస్తే బాగుంటుంది కానీ చెల్లెమ్మా అని డైలాగులు చెప్పడం బాగోదని చెప్పి హాలంతా నవ్వించేశారు. అంతేకాదు ఆ తర్వాత స్టేజి మీదే ఖైదీ నెంబర్ 150 పాటకు ఇద్దరు కలిసి చిన్నగా స్టెప్పులు వేయడం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తర్వాత సాయిపల్లవి మాట్లాడుతూ చిరంజీవి స్ఫూర్తితోనే డాన్సు నేర్చుకున్న తనకు ఇవాళ ఆయన నుంచే ఇంత గొప్ప కాంప్లిమెంట్ దక్కడం గురించి గర్వంగా చెప్పుకుంది

మొత్తానికి నిన్న ఈవెంట్ లో లవ్ స్టోరీ సినిమా సంగతుల కన్నా ఇలాంటి టిట్ బిట్స్ ఎక్కువ హై లైట్ అవ్వడం విశేషం. ఎవరూ టచ్ చేయని రెండు అంశాలను దర్శకుడు శేఖర్ కమ్ముల ఇందులో చూపించారని చెప్పిన నాగ చైతన్య అదేంటో మాత్రం రివీల్ చేయలేదు. సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ కూడా బాగా హై లైట్ అయ్యాడు. జూలై ఆఖరులో థియేటర్లు తెరుచుకున్నాక మరీ గొప్పగా ఏ సినిమా 9 కోట్లు దాటి వసూలు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ మార్క్ కి రెట్టింపు లవ్ స్టోరీ తెస్తుందనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్లలో ఉంది. మరి అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటే మాత్రం అదేమీ అసాధ్యం కాదు. చూద్దాం ఇంకో అయిదు రోజుల్లో తేలిపోతుంది

Also Read : సమస్యలపై చిరంజీవి గళం – దక్కాలి ఫలితం

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş