Idream media
Idream media
మహిళల రక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నడుం బిగించింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది.
త్యాచార కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో మహిళల రక్షణపై తాజా చట్టం రూపుదాల్చుతోంది.
11 న మంత్రి వర్గ సమావేశం..
ఈ చట్టానికి సంభందించిన ముసాయిదా బిల్లు ఇప్పటికే సిద్ధమైంది. ఈ నెల 11 వ తేదిన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముసాయిదా బిల్లును మంత్రి వర్గం ఆమోదించాక అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్నారు. దింతో పాటు పలు ముఖ్యమైన చట్టాలను చేసేందుకు అధికారపక్షం అడుగులు వేస్తోంది. గత బడ్జెట్ సమావేశాల్లో పలు విప్లవాత్మక, చరిత్రాత్మక చట్టాల ను జగన్ సర్కార్ తెచ్చిన విషయం తెలిసిందే.