iDreamPost
android-app
ios-app

రంగులు చెదిరాయి – ఫైనల్ కలెక్షన్స్

  • Published Apr 09, 2021 | 6:54 PM Updated Updated Apr 09, 2021 | 6:54 PM
రంగులు చెదిరాయి – ఫైనల్ కలెక్షన్స్

విడుదల ముందు భారీ అంచనాలు రేకెత్తించిన రంగ్ దే ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఉన్నప్పటికీ వసూళ్లు మొక్కుబడిగా ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా వకీల్ సాబ్ దెబ్బకు సెలవు తీసుకోక తప్పలేదు. అందులోనూ రంగ్ దేకు బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం చాలా ప్రతికూలంగా మారింది. విడుదల టైంలో డీసెంట్ రివ్యూలు, పర్వాలేదు అనిపించేలా వచ్చిన పబ్లిక్ టాక్ మొదటి వారం కలెక్షన్లకు బాగా ఉపయోగపడ్డాయి. కానీ లాంగ్ రన్ కు అవి పనికిరాలేదు. దీంతో చివరికి ఫ్లాప్ ముద్రతోనే రంగ్ దే సెలవు తీసుకోవాల్సి వచ్చింది. బాలన్స్ ఉన్న సెంటర్లలో ఎంత వచ్చినా అది చెప్పుకోదగ్గ మొత్తమయ్యే అవకాశమే లేదు.

ట్రేడ్ నుంచి వచ్చిన టాక్ మేరకు రంగ్ దే 16 కోట్ల 51 లక్షల షేర్ దగ్గర ముగింపు పలకబోతోంది. బ్రేక్ ఈవెన్ దాటలేకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది. కనీసం థియేట్రికల్ బిజినెస్ జరిగిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చినా బాగుండేది. కానీ అలా జరగలేదు. గతంలో చూసేసిన రెండు మూడు కథలను కలిపి ఏదో కొత్తగా చెప్పాలనుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ప్రయత్నం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో 2021లో నితిన్ కు వరసగా రెండో స్పీడ్ బ్రేకర్ పడింది. కాకపోతే చెక్ కంటే బెటర్ గా ఆడింది అని చెప్పుకోవడం ఒక్కటే ఊరట. ఇక వసూళ్ల విషయానికి వస్తే ఏరియాల వారీగా షేర్లు ఈ విధంగా ఉన్నాయి

రంగ్ దే ఫుల్ రన్ వసూళ్లు:

ఏరియా  షేర్ 
నైజాం  5.80cr
సీడెడ్  2.15cr
ఉత్తరాంధ్ర  1.78cr
గుంటూరు  1.18cr
క్రిష్ణ  0.74cr
ఈస్ట్ గోదావరి  1.08cr
వెస్ట్ గోదావరి  0.65cr
నెల్లూరు  0.52cr
ఆంధ్ర+తెలంగాణా  13.90cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.78cr
ఓవర్సీస్  1.83cr
ప్రపంచవ్యాప్తంగా 16.51cr

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు సుమారు 8 కోట్ల దూరంలో ఆగిపోయిన రంగ్ దే పికప్ అవ్వడం అత్యాశే. ఇప్పుడు వకీల్ సాబ్ కు పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి రంగ్ దే ఇకపై కొనసాగడం జరగని పని. వచ్చే వారం రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడినప్పటికీ దాని వల్ల ప్రయోజనం పవన్ సినిమాకు దక్కుతుంది కానీ రంగ్ దే అందుకునే అవకాశం లేదు. ఎంటర్ టైన్మెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించడంలో తడబడితే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో రంగ్ దే ఉదాహరణగా నిలిచింది. ఇక నితిన్ ఆశలన్నీ జూన్ 11న రాబోయే మ్యాస్ట్రో మీదే ఉన్నాయి. ఇందులో కళ్ళు లేని వాడిగా నటించడం అంచనాలు రేపుతోంది

Verdict: Flop