iDreamPost
iDreamPost
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రానా జట్టు కట్టబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ గా రూపొందబోతున్న ఈ సినిమా సితార బ్యానర్ పై రూపొందబోతోంది. గత దీపావళికి ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మల్టీ స్టారర్ అవసరమైన ఈ మూవీలో రెండో హీరో ఎవరనే సస్పెన్స్ కొంతకాలం సాగింది. ఒకదశలో రవితేజ పేరు వినిపించింది కానీ ఫైనల్ గా రానా లాక్ అయ్యాడు. ఇది ఫస్ట్ టైం కాంబినేషన్.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర దీనికి దర్శకుడు. పవన్ లాంటి స్టార్ హీరోని ఇంత త్వరగా డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అతి తక్కువ రోజుల్లో వేగంగా పూర్తి చేసేలా పవన్ దీనికి కాల్ షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. వకీల్ సాబ్ పూర్తి కాగానే దీన్ని వెంటనే మొదలుపెట్టబోతున్నారు. విడుదల కూడా 2021లొనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికీ తమన్ సంగీతం అందించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణ. పవన్ బ్యాక్ టు బ్యాక్ రెండు రీమేక్ సినిమాలకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనుండటం విశేషం. ఎన్ని పాటలు ఉంటాయనే క్లారిటీ లేదు.
ఇక ఇందులో హీరోయిన్లు ఎవరనే క్లారిటీ లేదు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన్ అనౌన్స్ మెంట్ త్వరలో వస్తుంది. పవన్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించనుండగా, రానా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్న ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఇద్దరి మధ్య ఈగోల క్లాష్ నేపథ్యంలో కథ సాగుతుంది. మలయాళం వర్షన్ క్రిటిక్స్ ని సైతం మెప్పించింది. తెలుగులో మాత్రం ఇద్దరు హీరోల ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు. స్టోరీ ప్రకారం చూసుకుంటే పవన్ రానాలు దీనికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేని ఈ డిఫరెంట్ సబ్జెక్టుని ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ బిల్లా రంగా టైటిల్ ని దీనికి పరిశీలిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.
Link Here @ http://bit.ly/37GIg77