iDreamPost
android-app
ios-app

చిరంజీవి మూడో తరం వస్తోంది – అఫీషియల్ గా చెప్పిన మెగాస్టార్

  • Published Dec 12, 2022 | 3:37 PM Updated Updated Dec 12, 2022 | 3:38 PM
చిరంజీవి మూడో తరం వస్తోంది – అఫీషియల్ గా చెప్పిన మెగాస్టార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహమై పదేళ్లు దాటుతున్నా సంతానం విషయంలో చాలా ఆలస్యం జరుగుతోందని ఫీలవుతున్న ఫ్యాన్స్ ని ఎట్టకేలకు చిరంజీవి స్వయంగా శుభవార్త చెప్పేశారు. త్వరలో కొడుకు కోడలు తల్లితండ్రులు కాబోతున్నారని గుడ్ న్యూస్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఇంకేముంది అభిమానులు ఆనందంతో దీన్ని వైరల్ చేస్తున్నారు. చరణ్ సమకాలీకులు దాదాపు అందరికీ వారసులు వచ్చారు. అల్లు అర్జున్ కో అబ్బాయి, జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు వారసులు, మహేష్ బాబుకి గౌతమ్ ఇలా అందరికీ సెట్ అయ్యారు కానీ ఎటొచ్చి మెగా ఫ్యామిలీలోనే ఆ లోటు కొనసాగుతూ వచ్చింది. ఫైనల్ గా అది తీరిపోయిందనే క్లారిటీ వచ్చేసింది

మెగాస్టార్ కు చరణ్ ఒక్కడే మగ సంతానం కావడంతో మూడో తరం క్యారీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాబోయే జనరేషన్ మీదుంది . అమ్మాయా అబ్బాయా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ జూనియర్ చరణ్ నే ఫ్యాన్స్ కోరుతున్నారు. నాగబాబు వైపు నుంచి వరుణ్ తేజ్ ఆల్రెడీ సెటిలైపోయాడు. పవన్ కళ్యాణ్ తరఫున అకీరాను అంగీకరించేందుకు అభిమానులు రెడీగానే ఉన్నారు. అయితే వీళ్లంతా సెకండ్ జనరేషన్ కిందకే వస్తారు. అందుకే చరణ్ విషయం ప్రత్యేకంగా నిలుస్తుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ కోర్స్ కు వెళ్లి రామ్ చరణ్ ఉపాసనను ఫోటోలు దిగడం అవి సోషల్ మీడియా వైరల్ కావడం జరిగిన కొన్ని గంటలకే ఇది వెల్లడి కావడం విశేషం.

చరణ్ ప్రస్తుతం శంకర్ ప్రాజెక్టుతో చాలాబిజీగా ఉన్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ లో సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా ఎప్పుడు లాంచ్ చేస్తారనే క్లారిటీ ఇంకా లేదు. దాన్ని ఆర్సి 17గా పరిగణిస్తున్నారనే టాక్ మెగా కాంపౌండ్ లో వినిపిస్తోంది. అంటే దానికన్నా ముందు మరో ప్యాన్ ఇండియా మూవీ ఉంటుందన్న మాట. పుష్ప 2 క్లైమాక్స్ లో చరణ్ ని ఎంట్రీ చేయించి దర్శకుడు సుకుమార్ ఏదో కొత్త స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి కానీ అదెంత వరకు నిజమో తెలియదు. ఏదైతేనేం మొత్తానికి చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పేశారు. చూద్దాం.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibombaymavi girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis