Idream media
Idream media
రాజ్యసభకు నూతనంగా ఎన్నికైనా నేతలు ఈ రోజు ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్యనాయుడు వీరిచేత సభలో ప్రమాణం చేయించారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభకు ఎన్నియ్యారు. వీరందరి చేత రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వరుసగాప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి మొదట ఆయోధ్య రామిరెడ్డి ప్రమాణం చేశారు. ఆయన హిందీలో తన ప్రమాణం పూర్తి చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపీదేవీ వెంకటరమణలు వరుసగా తెలుగులో ప్రమాణం చేశారు. వైసీపీ తరఫున ఎన్నికైన మరో సభ్యుడు పరిమళ్ నత్వాని వ్యక్తిగత కారణాలతో ఈ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. మరో రోజు ఆయన ప్రమాణం చేస్తారని వైసీపీ తెలిపింది. 55 మంది సభ్యుల్లో అత్యధిక మంది ఈ రోజు ప్రమాణం చేస్తున్నారు. ఈ రోజు హాజరుకాలేకపోయిన వారిచేత మరోమారు చైర్మన్ ప్రమాణం చేయించనున్నారు.