iDreamPost
android-app
ios-app

ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్ : ఎమ్మెల్యే రాజాసింగ్

ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్ : ఎమ్మెల్యే రాజాసింగ్

హిందూ మతం, ధర్మం, హిందూ రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్ అంటూ హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందూ మతం, ధర్మం పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందూ మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం సరి కాదని హితవు పలికారు. లౌకికతత్వం పై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. పవన్ చేసిన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే…

పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో తన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అని విమర్శించారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని ఆరోపించారు. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులేనని ఆరోపించారు. హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు.