అన్నదాతకు తీపి కబురు. మరో 48 గంటల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వాళ్ళ రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాలల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించింది. నైరుతి రుతు పవనాల తిరోగమన (ఈశాన్య రుతుపవనాలు) ప్రారంభానికి ఈ నెల 17న అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.