డార్లింగ్ అండ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ వెయిటింగ్ ప్రాజెక్ట్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ జూలై 30 అని చెప్పేసినా ఫ్యాన్స్ కి ఏమంత కిక్ అనిపించడం లేదు. ఇటీవలే ప్రేమికుల రోజు సందర్భంగా వదిలిన గ్లిమ్ప్స్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. ఓ రెండు ముక్కలు ఇటలీలో మూడు మాటలు తెలుగులో హీరో హీరోయిన్ల తో చెప్పించి మమ అనిపించడం వాళ్లకు నచ్చలేదు. ఇంకేదో ఆశించారు. కానీ అది నెరవేరలేదని సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ కి బట్టి చెప్పొచ్చు. అందులోనూ ప్రభాస్ ని సరిగా చూపలేదంటూ కెమెరా యాంగిల్స్ గురించి గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. ఇది రాధే శ్యామ్ మీద ప్రభావం చూపించేదే.
నిజానికి సాహో రేంజ్ లో బడ్జెట్ పెట్టి ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ప్రమోషన్ విషయంలో టీమ్ చాలా శ్రద్ధ వహించాలి. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా జనమేమి ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తపించి పోవడం లేదు. మొదటి రోజు కోట్ల వసూళ్లు వచ్చినా సినిమా బాగుందనే టాక్ వస్తేనే లాంగ్ రన్ లో నిలబడుతుంది. సాహోకు జరిగింది అదే. బ్యాడ్ టాక్ తెలుగులో ఫ్లాప్ చేసి పెట్టింది. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ పనిచేయలేదు. జనం కంటెంట్ కావాలన్నారు. అది అందులో లేకపోవడంతో తిరస్కరించారు. మ్యూజిక్ విషయంలో చేసిన నిర్లక్ష్యమూ తగిన మూల్యాన్ని చెల్లించేలా చేసింది.
ఇప్పుడు రాధే శ్యామ్ విషయంలో అది రిపీట్ కాకుండా జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ ఆ కారణంగా స్లో ఉంటే లాభం లేదు. ఎప్పుడో అక్టోబర్ లో వచ్చే ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే రెండు టీజర్లు చెప్పుకోదగిన అప్డేట్లు వచ్చాయి. కానీ రాధే శ్యామ్ నుంచి మాత్రం ఇలా గ్లిమ్ప్స్ ల పేరుతో వదులుతున్న వీడియోలు బిజినెస్ పరంగానూ హెల్ప్ అవ్వడం లేదు. అందుకే ఆచార్య కన్నా కొంత తక్కువ ఆఫర్స్ వస్తున్నాయనే గాసిప్ ట్రేడ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వీలైనంత త్వరగా అదిరిపోయే ఓ పబ్లిసిటీ మెటీరియల్ తో రాధే శ్యామ్ దూకుడు పెంచాల్సిన అవసరం చాలా ఉంది