iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతంపై రాజ్యసభలో చర్చ, సభ్యుల కన్నీరు

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతంపై  రాజ్యసభలో చర్చ, సభ్యుల కన్నీరు

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశా పై జరిగిన హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆడపిల్లల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు తీసుకుచ్చి ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షంచాలని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఈ హత్య ఘటనపై సోమవారం పార్లమెంట్ లో చర్చ జరిగింది. దిశను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపటంపై రాజ్యసభలో ఎంపీలు మాట్లాడారు. ఇలాంటి పనులు చేసే మృగాలకు ఉరిశిక్ష వేయాలంటు పార్లమెంటులో సభ్యులు గళమెత్తారు. నలుగురు నిందితులను సాధ్యమైనంత త్వరగా శిక్షించాలని వారు సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమే బాధితులకు న్యాయం జరిగెలా ప్రభుత్వాలు చూడాలని ఎంపీ లు కోరారు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, మహిళలపై అరాచకాలు ఆగటం లేదని, దిశాను దారుణంగా హతమార్చిన కిరాతకులను ఈ నెల 31లోగా ఉరితీయాలని కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. దిశ పై జరిగిన అత్యాచారం, హత్యను గుర్తుచేసుకుంటు మహిళా ఎంపీలు కన్నీరు పెట్టుకున్నారు. ఈఘటనపై దేశం మొత్తం సిగ్గుపడాలన్నారు. న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని, కఠిన శిక్షలను వెంటనే అమలు చేసేలా నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని కొందరు ఎంపీ లు అభిప్రాయబడ్డారు.