iDreamPost
android-app
ios-app

నేటి సాయంత్రం జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్న ప్ర‌ధాని

  • Published Oct 20, 2020 | 8:45 AM Updated Updated Oct 20, 2020 | 8:45 AM
నేటి సాయంత్రం జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్న ప్ర‌ధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేటి సాయంత్రం 6 గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు తానో విష‌యం చెప్ప‌నున్న‌ట్లు ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. అయితే ఆయన ఏమి చెప్పబోతున్నారనే అంశానికి సంబంధించి పూర్తి స‌మాచారం ఇంకా తెలియ‌దు. దేశ ప్రజలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి ఆరు సార్లు ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన విష‌యం తెలిసిందే.

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌త మూడు నెల‌లతో పోల్చి చూస్తే ఇవాళ తొలిసారి 50 వేల లోపు న‌మోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన ట్వీట్ దేనికి సంబంధించిన విషయం మాట్లాడటానికే అయి ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఏమి మాట్లాడబోతున్నారనే అంశం తెలియాలి అంటే సాయంత్రం 6వరకు వేచి చూడాల్సిందే.