iDreamPost
android-app
ios-app

పండగ లాంటి హిట్టు – క్లోజింగ్ కలెక్షన్స్

  • Published Jan 21, 2020 | 10:47 AM Updated Updated Jan 21, 2020 | 10:47 AM
పండగ లాంటి హిట్టు – క్లోజింగ్ కలెక్షన్స్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ప్రతి రోజు పండగే ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. మొదట్లో సెంటిమెంట్ గురించి టాక్ కొంచెం అటుఇటుగా వచ్చినా సినిమాలోని కామెడీ కి జనం బాగా కనెక్ట్ అయిపోవడంతో చాలా గ్యాప్ తర్వాత తేజ్ కి పెద్ద హిట్టు దక్కింది. సుమారు 30 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఫుల్ రన్ లో సుప్రీమ్ ని క్రాస్ చేసిన ప్రతి రోజు పండగే హీరో కెరీర్ లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. తాత మనవళ్ల సెంటిమెంట్, రావు రమేష్ టైమింగ్, తమన్ సంగీతం, రాశి ఖన్నా గ్లామర్ ఇవన్నీ కలగలిసి ఊహించిన దాని కన్నా ఘన విజయాన్ని అందించాయి.

ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన తరుణంలో తేజూ, మారుతీలు కలిసి చేసిన ఎమోషనల్ కం కామెడీ డ్రామా బాగా వర్క్ ఔట్ అయ్యింది. సంక్రాంతి సినిమాల తాకిడికి ప్రతిరోజు పండగే కాస్త త్వరగానే సర్దుకోవాల్సి వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం. ఇప్పుడీ సక్సెస్ ఇచ్చిన కిక్ తో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకు సో బెటరుతో రానుండగా మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితోనన్న క్లారిటీ ఇంకా రాలేదు. ఇయర్ ఎండింగ్ లో మంచి హిట్టుతో ఏడాది ముగిసిందని మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడీ సంవత్సరం అల వైకుంఠపురములో రూపంలో బ్లాక్ బస్టర్ దక్కడం వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

ఏరియా వారి ఫుల్ రన్ కలెక్షన్స్ వివరాలు 

ఏరియా  షేర్ 
నైజాం  10.10cr
సీడెడ్   3.75cr
ఉత్తరాంధ్ర  3.80cr
గుంటూరు   1.90cr
కృష్ణ   2.01cr
ఈస్ట్ గోదావరి  2.10cr
వెస్ట్ గోదావరి  1.55cr
నెల్లూరు   0.91cr
మొత్తం Ap/Tg 26.12cr
కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా 2.25cr
ఓవర్సీస్ 2.50cr
ప్రపంచవ్యాప్తంగా 30.87cr

Verdict – సూపర్ హిట్

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş