iDreamPost
android-app
ios-app

డార్లింగ్ చేయబోయే అరుదైన పాత్ర

  • Published Jul 20, 2020 | 11:26 AM Updated Updated Jul 20, 2020 | 11:26 AM
డార్లింగ్ చేయబోయే అరుదైన పాత్ర

నిన్న ప్రభాస్ 21కి దీపికా పదుకునేని హీరోయిన్ గా ప్రకటించడం సోషల్ మీడియాని ఊపేసింది. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ కు వెళ్ళడానికి ముందే భారీ అంచనాలు మూటగట్టుకుంటోంది. వైజయంతి సంస్థ కావడంతో హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి క్లాసిక్స్ అందించిన దర్శకుడు నాగ అశ్విన్ డార్లింగ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరా లేక సోషియో ఫాంటసీనా అనే లీకైతే ప్రస్తుతానికి బయటికి రాలేదు కానీ ఒక ఆసక్తికరమైన వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ప్రభాస్ ఇందులో రాజు పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. దీన్నే ఇన్ డైరెక్ట్ గా సూచిస్తూ అశ్విన్ నిన్న తన ట్వీట్ లో రాజుకి తగ్గ రాణి దొరికిందని చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. బాహుబలిలో ఇదే తరహా రోల్ చేసినప్పటికీ అది జానపదం. కానీ ఇప్పుడిది ఫాంటసీ కం థ్రిల్లర్ గా చెబుతున్నారు . ఇలాంటి రాజుల పాత్రలు ఇప్పటి తరం హీరోలు పెద్దగా చేసిన దాఖలాలు లేవు. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ లెక్కలేనన్ని సినిమాలు రాజుగారిలా చేశారు కాని నెక్స్ట్ జెనరేషన్ లో మాత్రం తగ్గుతూ వచ్చాయి. చిరంజీవి రాజా విక్రమార్క, బాలకృష్ణ ఆదిత్య 369, వెంకటేష్ నాగవల్లి ఇలా అడపాదడపా చేశారు కానీ ఈ జోనర్ లో మాత్రం తక్కువగానే వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ అలా చేస్తాడంటే అంతకన్నా ఎగ్జైట్ మెంట్ ఏముంటుంది.

దీపికాను ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం కూడా పద్మావత్ అని చెప్పొచ్చు. అందులో తన నటన విమర్శకుల ప్రశంశలు అందుకోవడమే కాదు చాలా హుందాగా దర్పంతో అచ్చం మహారాణిలా జీవం పోసింది. అందుకే నాగ అశ్విన్ ఏరికోరి మరీ తననే తీసుకున్నట్టు ఉన్నాడు. రెమ్యునరేషన్ కూడా భారీగా ఆఫర్ చేశారని ఇప్పటిదాకా ఏ నార్త్ స్టార్ కి ఇవ్వనంత అమౌంట్ లాక్ అయ్యిందని వినికిడి. అది ఎంతో ఇప్పుడే బయటికి వచ్చే ఛాన్స్ లేదు కానీ మొత్తానికి పాన్ ఇండియా తప్ప బడ్జెట్ పరంగా ఇంకే తక్కువ స్థాయి చేయలేని మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ రాధే శ్యామ్ వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. 2022లో నాగ అశ్విన్ మూవీ ఉంటుంది