iDreamPost
android-app
ios-app

మూడోసారి పెదనాన్న కాంబో ?

  • Published Sep 13, 2020 | 6:07 AM Updated Updated Sep 13, 2020 | 6:07 AM
మూడోసారి పెదనాన్న కాంబో ?

ఎన్నడూ లేనిది డార్లింగ్ ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే . రాధే శ్యామ్ షూటింగ్ అతి త్వరలో మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తిచేయాలనే టార్గెట్ లో ఉన్నారు. దీని తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి సంస్థ నిర్మించే భారీ చిత్రం ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆది పురుష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. అతి తక్కువ టైంలో చిత్రీకరణ ఫినిష్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ సమయం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. తానాజీ ఫేమ్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చవచ్చని బాలీవుడ్ టాక్.

ఇదిలా ఉండగా ఇందులో రెబెల్ స్టార్ కం ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారికి ఓ కీలక పాత్ర ఆఫర్ చేయబోతున్నట్టు సమాచారం. ఎలాగూ రామాయణ గాధ కాబట్టి రాముడి తండ్రి దశరథుడి క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు వినికిడి. ఇప్పటికే ప్రతిపాదన వెళ్లిందని సమాచారం. అయితే కృష్ణంరాజు గారు చాలా కాలంగా తెరకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య రిత్యా సినిమాలు చేయడం లేదు. 2015లో అనుష్క రుద్రమదేవి తర్వాత మళ్ళీ కనిపించలేదు. మరి ఆది పురుష్ కి పాజిటివ్ కి స్పందించే అవకాశం ఉంది. ప్రభాస్ తో కలిసి కృష్ణంరాజు గారు గతంలో బిల్లా, రెబెల్ చేశారు. మొదటిది హిట్ అనిపించుకోగా రెండోది దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ,మరోసారి కాంబో సాధ్యపడలేదు.

ఇప్పుడిది జరిగితే అభిమానులకు పండగే. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఆది పురుష్ లో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఇప్పటికైతే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ భయపడుతున్నట్టు దీనికి మరీ ఏళ్లకు ఏళ్ళు ఖర్చు పెట్టకుండా కేవలం నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తారని తెలిసింది. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో అన్ని బాషల ముఖ్యమైన ఆర్టిస్టులు కనిపించబోతున్నారు. ఇకపై రెగ్యులర్ గా ఒక్కొక్కరిని ప్రమోషన్ రూపంలో పోస్టర్ల ద్వారా పరిచయం చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. తెలుగులో టైటిల్ ఆది పురుష్ ఉంటుందా లేక మారుస్తారా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఏదైతేనేం మూడోసారి పెదనాన్న ప్రభాస్ కలిసి తెరమీద సందడి చేయబోతున్నారా లేదా మరికొద్ది రోజుల్లో తెలియనుంది.