ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ఫామ్ తో పాటు నెంబర్ వన్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే త్వరలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా తనే ఫిక్సయినట్టు ఇన్ సైడ్ టాక్ . ప్రస్తుతం పవన్ అయ్యప్పనుం కోషియం రీమేక్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదయ్యాక క్రిష్ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. తర్వాత వెంటనే హరీష్ శంకర్ ది పట్టాలు ఎక్కుతుంది. అయితే దీనికి ఇంకా టైం ఉండటంతో ఈలోగా క్యాస్టింగ్ తాలూకు పనుల్లో తను బిజీగా ఉన్నాడు. మైత్రి సంస్థ కాబట్టి బడ్జెట్ భారీగానే ఉండబోతోంది.
ప్రత్యేకంగా పూజానే హరీష్ ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. తను డైరెక్ట్ చేసిన డీజే దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేష్ లో హీరోయిన్ తనే. నిజానికి పూజా హెగ్డే టాలీవుడ్ డెబ్యూ చేసిన రెండు సినిమాలు ముకుందా, ఒక లైలా కోసం ఫ్లాపయినప్పుడు అందరూ ఐరన్ లెగ్ అన్నారు. అక్కడ బాలీవుడ్ లోనూ బెడిసి కొట్టింది. ఆ టైంలోనే అల్లు అర్జున్ సరసన డీజే లో ఛాన్స్ ఇచ్చాడు హరీష్. అదేమీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా పూజా హెగ్డేకు చాలా పేరు వచ్చింది. ఆ కృతజ్ఞతతోనే గద్దలకొండ గణేష్ లో కేవలం ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వచ్చే క్యామియో రోల్ కు ఒప్పుకుంది. అది సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.
సో ఈ కాంబో ఆల్మోస్ట్ ఓకే అయినట్టే అనుకోవచ్చు. అందులోనూ పూజా హెగ్డే కాల్ షీట్స్ వచ్చే ఏడాదికి తీసుకోవడం అంత కష్టమేమి కాదు. ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యాం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగులు అయిపోయాయి. ఆచార్యలో ఫుల్ లెన్త్ రోల్ కాదు కాబట్టి మహా అయితే రెండు నెలల్లో కొద్దిరోజులు పాల్గొంటే సరిపోతుంది. సల్మాన్ ఖాన్ చేయబోయే సినిమా కాల్ షీట్లు ఈ సంవత్సరంలోనే ఉంటాయి. మరో హిందీ సినిమా సర్కస్ కూడా డిసెంబర్ లోపే అయిపోతుంది. సో పూజాకు పవన్ కళ్యాణ్ సినిమా చేయడం ఈజీనే. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలందరితోనే చేసిన తనకు బాలన్స్ ఉన్న పవన్ లోటు తీరిపోనుంది. అఫీషియల్ నోట్ రావాలి మరి.