iDreamPost
android-app
ios-app

జనగణమన కోసం పూజాహెగ్డే స్టంట్లు

  • Published May 31, 2022 | 6:15 PM Updated Updated May 31, 2022 | 6:15 PM
  • Published May 31, 2022 | 6:15 PMUpdated May 31, 2022 | 6:15 PM
జనగణమన కోసం పూజాహెగ్డే స్టంట్లు

ఇప్పటిదాకా సుకుమారమైన హీరోయిన్ పాత్రలకే పరిమితమైన పూజా హెగ్డే త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లనుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీలో స్టంట్లు చేయడం కోసం థాయిలాండ్ నుంచి ప్రత్యేకమైన మాస్టర్ల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనుంది. దీనికిగాను హైదరాబాద్ లో ఏర్పాట్లు చేశారు. ఛాలెంజింగ్ అనిపించే రోల్ కోసం డూప్ మీద ఆధారపడకుండా పూజా వీటిని పెర్ఫార్మ్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఫైట్లతో పాటు మౌంటెన్ ట్రెక్కింగ్గులు గట్రా రిస్కీ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. మరి పూజాకు ఎలాంటి ఎపిసోడ్స్ పెట్టారో చూడాలి.

కొద్దిరోజుల క్రితం జనగణమనలో పూజా కేవలం ఒక స్పషల్ సాంగ్ మాత్రమే చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ టీమ్ వాటిని ఖండిస్తూ హీరోయిన్ అనే క్లారిటీ ఇచ్చింది. ఇటీవలి కాలంలో వరస డిజాస్టర్లతో పూజా హెగ్డే గ్రాఫ్ కొంత డౌన్ అయ్యింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్ మళ్ళీ తిరగబడిందని ట్రోలర్లు రెచ్చిపోయారు. అయినా పూజకొచ్చిన నష్టమేమి లేదు. మహేష్ బాబు 28, సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీవాలి లాంటి క్రేజీ ప్రాజెక్టులు తన ఖాతాలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు తన డిమాండ్ కు వచ్చిన లోటేమి లేదు.

ఇక విజయ్ దేవరకొండ ఇటీవలే సమంతాతో చేస్తున్న ఖుషి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక మూడు నెలల ముందే లైగర్ ప్రమోషన్లు మొదలు పెట్టేశాడు. ఖుషితో పాటు జనగణమనను సమాంతరంగా చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఖుషి డిసెంబర్ విడుదల ఆల్రెడీ లాక్ అయ్యింది కాబట్టి దానికి అనుగుణంగా చిత్రీకరణలు ఉంటాయి. మొన్నటిదాకా కొత్త హీరోయిన్లతో జోడి కట్టిన విజయ్ ఇప్పుడు సమంతా, పూజా హెగ్డే లాంటి తనకన్నా సీనియర్లతో ఆడిపాడేందుకు ఉత్సాహం చూపించడం విశేషం. జనగణమన దేశభక్తి చిత్రం కావడంతో తన ఇమేజ్ కి కొత్త మేకోవర్ లా ఉంటుందనే నమ్మకం తనలో వ్యక్తమవుతోంది. లెట్ వెయిట్ అండ్ సీ.

Jojobet Girişbetparken çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş