తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె లో భాగంగా రేపు బుధవారం ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సకల జనుల సభకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. సరూర్ నగర్ లో సభ జరిపేందుకు ఆర్టీసీ జేఏసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అనుమతి నిరాకరించడంపై జేఏసీ హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహన్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
మరో వైపు ఆర్టీసీ సమ్మె పై మధ్యాహన్నం 2:30 గంటలకు హైకోర్టు లో విచారణ జరగనుంది. విచారణ లో ప్రభుత్వం తరపున వాదన ఎలా ఉండాలన్న దానిపై సీఎం కేసీఆర్.. అడ్వకేట్ జనరల్, ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు మంగళవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ తో కలసి సీఎం అధికారులతో సమేవేశం నిర్వహించారు.