iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ మహిళా నేత పంచుమర్తి అనురాధ పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వం పై సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అమె పై కేసు నమోదైంది . వివరాల్లోకి వెళితే అమరావతిలో రాజధాని పేరిట జరుగుతున్న ఉద్యమం 300వ రోజుకు చేరిందంటూ తెలుగుదేశం సోషల్ మీడియా సెల్ ఆద్వర్యంలో ట్విట్టర్ వేదికగా ప్రచారానికి తెరలేపారు.
అయితే ఈ ప్రచారంలో పాల్గొన్న అనురాధ అమరావతిలో మహిళలపై పోలీసుల దౌర్జన్యం అంటూ రెండు ఫోటోలు తన ట్విట్టర్ ఖాతానుండి పోస్ట్ చేశారు. నిజానికి ఆమె పోస్ట్ చేసిన ఆ ఫోటోలు అసలు రాజధాని అమరావతి ఆందోళన కు సంభందించనవి కాకపోగా ఆ రెండు ఫోటోలు తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలపై ప్రభుత్వం చేయించిన దౌర్జన్యాలకు సంభందిచినవే కావటం గమనార్హం .
ఇలా తెలుగుదేశం పాలనలో మహిళలపై జరిగిన దౌర్జన్యానికి సంభందించిన ఫోటోలను తెచ్చి జగన్ ప్రభుత్వంలో అమరావతి మహిళలపై దాడి అంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టూ చేసి ఉద్దేశ పూర్వకంగా రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసినందుకు అమె పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ఈ తరహా దుష్ప్రచారం అనురాధాకి కొత్తేమీ కాదు . గతంలో కూడా ముఖ్యమంత్రి నివాస ప్రాంత పరిసరాలలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి అంటూ ఓ మహిళ చేత ఆరోపణలు చేయించి అడ్డంగా దొరికిపోగా , ఇటీవల రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో మహిళా ఉద్యమకారులు టాప్ లెస్ బాత్రూమ్స్ లో స్నానం చేస్తుంటే పోలీసులు ద్రోణ్ కెమెరాలతో షూట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసిన అనురాధ అసలు ఆ ఊర్లో టాప్ లెస్ బాత్రూమ్ ఒక్కటి కూడా లేదన్న నిజం బయటికొచ్చాక మౌనం వహించారు . మరోవైపు అమరావతి పరిసర గ్రామంలో ఓ చర్చ్ ఫాస్టర్ అనారోగ్యంతో చనిపోగా అమరావతి ఉద్యమానికి మరో గుండె బలి అంటూ లోకేష్ శవ రాజకీయం చేసే ప్రయత్నం చేయగా ఆ మృతుని కుమార్తె తీవ్ర పదజాలంతో ఖండించి తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు తప్ప అమరావతితో సంభందం లేదని తేల్చి చెప్పింది .
ఈ ఘటనలు చూస్తుంటే టీడీపీ చేస్తున్న అమరావతి ఉద్యమం , అసత్య ప్రచారాల ఉద్యమంగా , శవ రాజకీయాల వేదికగా సాగుతోంది అనిపించక మానదు ..