iDreamPost
android-app
ios-app

కోడిగుడ్డుపై ఈక‌లు పీక‌డం బాబు ఆర్ట్‌

కోడిగుడ్డుపై ఈక‌లు పీక‌డం బాబు ఆర్ట్‌

“ఏంటి న్యూస్?” చంద్ర‌బాబు అడిగాడు పీఏని
“నీయ‌మ్మ మొగుడు క‌ట్టించాడా గుడిని అని కొడాలి నాని మిమ్మ‌ల్ని తిట్టాడు” చెప్పాడు పీఏ
“తిట్టింది న‌న్ను కాదు, దేవున్ని” అన్నాడు బాబు
“అంటే మీరు దేవుడా?”
“న‌న్ను కాదు, వెంక‌టేశ్వ‌ర‌స్వామిని”
“దీంట్లో ఆయ‌న్నెందుకు లాగుతున్నారు”
“దేవున్ని, మ‌తాన్నిలాగి మ‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డ‌మే రాజ‌కీయం, వెళ్లి విలేక‌రుల్ని పిలువు” అన్నాడు బాబు
విలేక‌రులొచ్చారు.

See Also: ఇంకెప్పుడు అర్ధమవుతుంది బాబు?

బాబు స్టార్ట్ చేశాడు.
“కొడాలి నాని దేవున్ని అవ‌మాన‌ప‌రిచాడు. సాక్షాత్తూ శ్రీ‌నివాసున్ని బూతులు తిట్టాడు. ఇదంతా హిందూ మ‌తంపై కుట్ర‌. వెంక‌టేశ్వ‌ర‌స్వామిని తిట్ట‌డం వ‌ల్ల క్రైస్త‌వాన్ని అభివృద్ధి చేయాల‌నుకుంటున్నాడు”
విలేక‌రులు బుర్ర గోక్కుని “దీంట్లో కుట్ర ఎక్క‌డుంది. మ‌ధ్య‌లో క్రైస్త‌వాన్ని ఎందుకు తెచ్చారు?” అని అడిగారు.
“జ‌గ‌న్ ఏం చేసినా, ఆయ‌న మంత్రులు ఏం మాట్లాడినా దాంట్లో కుట్ర వుంటుంది. అమ్మ మొగుడు అంటే ఎవ‌రు, నాన్న క‌దా, ఈ ప్ర‌పంచానికి తండ్రి శ్రీ‌నివాసుడైతే, ఆయ‌న్ని తండ్రి అని పిల‌వాలి కాని అమ్మ మొగుడు అంటాడా?”
“ఇది దేవున్ని తిట్ట‌డ‌మే క‌దా” అన్నాడు బాబు.

See Also: వర్మ రాజ్యంలో’ శాంతిదూత

“బోడిగుండుకి, మోకాలుకి లింక్ పెట్ట‌కండి” అన్నారు విలేఖరులు
“మీరు కూడా దేవున్ని అనుమానిస్తున్నారు. బోడిగుండు అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది తిరుమ‌ల‌. త‌ల‌నీలాలు ఇవ్వ‌డం మ‌న సంస్కృతి. బోడిగుండు అంటే సంస్కృతిని అవ‌మానించ‌డ‌మే”
విలేఖరులు భ‌య‌ప‌డి “భ‌గ‌వంతుడా అన్నీ మీకు బూతులాగే వినిపించేలా ఉంది” అన్నారు.
“అవును, భ‌గ‌వంతున్ని వంతుల‌వారీగా తిడుతున్నారు వైసీపీ నేత‌లు. దైవ దూష‌ణ ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యం” అన్నాడు బాబు
విలేఖరులు పీఏని పిలిచి “ఎవ‌రికైనా చూపించండి. అలాగే వ‌దిలేయ‌కండి” అని స‌ల‌హా ఇచ్చారు.