iDreamPost
android-app
ios-app

నూతన సంవత్సరంలో కొత్త పింఛన్లు

  • Published Oct 30, 2019 | 5:00 AM Updated Updated Oct 30, 2019 | 5:00 AM
నూతన సంవత్సరంలో కొత్త పింఛన్లు

నూతన సంవత్సరం ప్రారంభంలో‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పథకంలో కొత్త పెన్షన్ల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ.. తదితర పింఛన్లు మంజూరుకోసం నవంబర్‌ 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్‌ 25వ తేదీ వరకు వలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హులనుంచి వారి ఇంటివద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు.

అదే సమయంలో ఇప్పటికే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్ని సైతం వలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పింఛన్లకోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డులవారీగా జాబితాలు తయారుచేసి, వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్‌ 1–14వ తేదీల మధ్య సోషల్‌ ఆడిట్‌ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ 15న మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి..  కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నారు.