iDreamPost
android-app
ios-app

పింఛన్ అర్హుల జాబితా విడుదల

పింఛన్ అర్హుల జాబితా విడుదల

నూతన సంవత్సరంలో పింఛన్ మంజూరు ద్వారా తీపి కబురు చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర 12 విభాగాల్లో జగన్ సర్కార్ పింఛను అందిస్తోంది. మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పింఛన్ సొమ్మును 2 వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతూ సీఎం జగన్ తొలి సంతకం చేశారు.

పాలన చేపట్టి 6 నెలలు ముగిసింది. ఇప్పటికే పలు సంక్షేమ పధకాలు అమలు చేసారు. తాజాగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. మూడు నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న కొత్త పింఛన్ల మంజూరు నూతన సంవత్సరంలో కానుంది. పింఛన్ మంజూరు వయస్సును 65 ఏళ్ల నుంచి 60 కి జగన్ సర్కార్ తగ్గించింది. ఫలితంగా లక్షలాది మందికి లభ్ది చేకూరింది.

పింఛన్ అర్హతలను కూడా జగన ప్రభుత్వం సరళీకరించింది. గతంలో 5 ఎకరాల లోపు ఉన్న వారికే పింఛన్ ఇస్తుండగా ప్రస్తుతం ఆ పరిమితిని 10 ఎకరాలకు పెంచింది. మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. ఈ వెలుసు బాటు వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉన్న వారికి పింఛన్ మంజూరు చేస్తున్నారు.

అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించారు. గత నెల 20 నుంచి వైఎస్సార్ నవశకం పేరుతొ వాలంటీర్లు మరో సారి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటన్నిటిని క్రోడీకరించి అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచారు. వాలంటీర్లకు అందజేశారు. ప్రజలు, లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు స్వీకరణ తరవాత జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు.