ప్రముఖ తెలుగు సినీ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నటుడు పవన్ పుట్టినరోజు రేపు సెప్టెంబర్ 2న కావడంతో ఆయన అభిమానులు నేటి నుండే వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు.
ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఆయన అభిమానులు పుట్టిన రోజు బ్యానర్‌లు కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ ఘాతానికి గురైన పవన్ అభిమానుల్లో ముగ్గురు మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు . ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స కోసం పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు.