iDreamPost
android-app
ios-app

బాబాయ్ అబ్బాయి మెగా కాంబో – నిజమేనా

  • Published Jan 18, 2021 | 5:55 AM Updated Updated Jan 18, 2021 | 5:55 AM
బాబాయ్ అబ్బాయి మెగా కాంబో – నిజమేనా

మెగా ఫ్యామిలీలో ఎందరు హీరోలు ఉన్నా వాళ్లలో ఒకరో ఇద్దరో కలిసి నటించడం కూడా అరుదుగా జరుగుతోంది. అంతెందుకు ఇప్పటిదాకా వరుణ్ తేజ్ సాయి తేజ్ లు సైతం తమ టీమ్ మెంబెర్స్ తో జట్టుకట్టలేదు. చిరంజీవి రామ్ చరణ్ కాంబోనే ఫుల్ లెన్త్ సినిమా ఇన్నేళ్లకు ఆచార్యలో సాధ్యపడుతోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇంకెవరితో అయినా చేయడం ఊహించగలమా. కానీ ఇది నిజం కాబోతోందని లేటెస్ట్ అప్ డేట్. నాన్నతో కలిసి రెండు సినిమాల్లో గెస్ట్ సీన్లు, ఒక మూవీలో పూర్తి స్థాయి పాత్ర చేసిన చరణ్ ఎప్పటి నుంచో బాబాయ్ పవన్ తో కూడా కలిసి నటించాలని ఎదురు చూస్తున్నాడు. అది ఇప్పుడు నెరవేరబోతోందట.

అది కూడా ఆషామాషీ డైరెక్టర్ తో కాదండోయ్. ఇండియన్ స్పిల్ బర్గ్ గా భావించే శంకర్ తో అని వినికిడి. 1994లో జెంటిల్ మెన్ చూసినప్పటి నుంచే చిరంజీవికి శంకర్ తో చేయాలనీ చాలా ఉండేది. కానీ ఎందరు నిర్మాతలు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా కూడా ఇది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు తన కొడుకుకు సాధ్యమవుతుందంటే ఆయనకు మాత్రం సంతోషంగా ఉండదా. అందులోనూ పవన్ చరణ్ కాంబో అంటే అంచనాలు ఇంకే స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇది అధికారికంగా వచ్చిన వార్త కాదు కానీ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చ జోరుగా సాగుతోంది.

శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తున్న ఇండియన్ 2 షూటింగ్ ని రీ స్టార్ట్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. క్రేన్ యాక్సిడెంట్ జరిగి యూనిట్ సభ్యులు చనిపోయిన కొంతకాలానికే లాక్ డౌన్ రావడంతో ఇది ఒక్క ఇంచు ముందుకు సాగలేదు. పైపెచ్చు నిర్మాణ సంస్థ లైకా పెండింగ్ లో పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు కమల్ రాజకీయాలతో పాటు బిగ్ బాస్ 4 షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 అసలు ఎప్పుడు ఉంటుందనేది ఎవరికీ తెలియదు. ఈలోగా శంకర్ పవన్ చరణ్ కు సెట్ అయ్యేలా ఒక కమర్షియల్ మెసేజ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.