పాకిస్థాన్‌లో గురువారం ఉదయం ఓ రైల్లో రెండు సిలిండర్లు పేలి 74 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు దొంగచాటుగా సిలిండర్లు తెచ్చి, కదులుతున్న రైల్లో వంట చేయడానికి ప్రయత్నించిన కారణంగానే ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. కరాచీ నుంచి లాహో ర్ వెళ్తున్న తేజ్‌గాం ఎక్స్‌ప్రె్‌సలో లియాఖత్‌పూర్ వద్ద మంటలు చెలరేగాయి. ప్రయాణికులు తమ ప్రాణా లు రక్షించుకొనే క్రమంలో రైలు నుంచి దూకడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు.