iDreamPost
iDreamPost
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంటే ముఖ్యమైన అంశం అమరావతి. అనేక మంది అమరావతిపై చర్చ చేస్తున్నారు. ఈ అమరావతి ఒక నగరమో, పట్టణమో, గ్రామమో తెలియదు. చారిత్రక అమరావతి పట్టణం ఇప్పుడు చర్చ చేసే అమరావతి ఒకటి కాదు. అసలు ఆ అమరావతి ఈ అమరావతిలోని 29 గ్రామాల్లో భాగం కూడా కాదు.
చర్చ జరుగుతున్న అమరావతి 29 గ్రామాల సమూహం. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాలు ఇవి. యేడాదికి మూడు పంటలు, నాలుగు పంటలు పండే భూములు. కృష్ణా నదీ తీరంలో 18 కిలోమీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల వెడల్పు విస్తరించిన బహుళ పంటలు పండే జరీబు భూములు కొన్ని. ఒక్క పంట పండే మెట్ట భూములు ఇంకొన్ని.
ఇవన్నీ 2014 చివర్లో రాజధాని ప్రాంతంగా గుర్తించబడ్డాయి. 2016 నాటికి రాజధాని నగర నిర్మాణం కోసం రైతులు “ఐచ్చికంగా ” ఇచ్చిన భూములు.ఈ భూములను రాజధాని కోసం ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం సేకరించలేదు (Acquisition). ఇంకేదో చట్టం ప్రకారం సమీకరించలేదు (Pooling). “భూసమీకరణ” (pooling) అని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవానికి రైతులు “ఐచ్చికంగా” ఇస్తున్నట్టు ధృవపత్రాలు ఇచ్చారు.
ఇది ఒకరకంగా విజయవాడలో రెండు దశాబ్దాల క్రితం మొదలై విశ్వవ్యాప్తం అయిన (డెవలప్మెంట్) పద్దతి. యజమాని నుండి స్థలం తీసుకుని ఒక బిల్డర్ అపార్ట్మెంట్ నిర్మించడం, అందులో 50:50 కానీ 60:40 రేషియోలో కానీ బిల్డర్, యజమాని వాటాలు వేసుకోవడం. ఇందుకోసం స్థలం యజమాని, బిల్డర్ పరస్పర అంగీకార పత్రం కూడా రాసుకుంటారు. ఈ పద్ధతినే అమరావతి కోసం ప్రభుత్వం ప్రయోగించింది. భూములు రైతులవి. అందులో పెట్టుబడులు CRDA తరపున వేరెవరివో (సింగపూర్ తో సహా) . బిల్డర్ తన ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తే ఇద్దరికీ లాభమే. ఏ కారణం చేతనైనా బిల్డర్ వల్ల నిర్మాణం ఆగిపోతే యజమానికి మిగిలేది తలనొప్పే. ఇప్పుడు అమరావతిలో జరుగుతోంది ఇదే. ఈ యజమానికి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం రాదు.
Also Read: చెప్పింది ఆకాశమంత – కట్టింది అణువంత
నన్ను చూసి రైతులు భూములు స్వచ్చందంగా ఇచ్చారు అంటూ చెప్పుకున్న నాటి ముఖ్యమంత్రి, శనగలు తిని చేతులు కడుకున్నట్లు రైతులకు ఏ హక్కు లేకుండా చేసి వారి భూములను తీసుకున్నారన్న విషయం ఇప్పటికే రైతులకు అర్ధం అయ్యింది. ..
రైతులు తమ యాజమాన్యంలో ఉన్న భూములను యధా తధంగా సిఆర్డీఏకి బదలాయించలేదు. పది ఎకరాలు ఉన్న రైతు ఎనిమిది ఎకరాలు అమ్ముకుని రెండు ఎకరాలు మాత్రమే సీఆర్డీఏకి బదలాయించారు. అయితే అమ్మిన ఆ ఎనిమిది ఎకరాలు కూడా కొన్న వ్యక్తి కాకుండా రైతులే ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ ఎనిమిది ఎకరాలు కొన్న వారి పేర్లు సీఆర్డీఏ రికార్డుల్లో లేవు. సీఆర్డీఏ చెల్లించే వార్షిక నష్టపరిహారం ఆ భూములు కొన్నవారి పేరున కాకుండా అమ్మిన రైతుల పేరున సీఆర్డీఏ నుండి చెల్లించబడుతోంది. అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చే ప్రక్రియ కూడా కొన్నవారి పేరున కాకుండా రైతుల పేరుతోనే నడుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన “క్యాపిటల్ గెయిన్స్” వెసులుబాటు కూడా భూములు కొన్న వారిపేరున కాకుండా అమ్మిన రైతుల పేరున మాత్రమే వస్తోంది. ఇవన్నీ చట్టబద్దమైన లావాదేవీలు కాదు. లోతుగా పరిశీలిస్తే చట్టం కళ్ళు కప్పి జరిగిన, జరుగుతున్న లావాదేవీలు. ప్రభుత్వం గట్టిగా ప్రశ్నిస్తే, పరిశోధిస్తే భూములు అమ్మిన రైతులు, కొన్న వ్యక్తులు చిక్కుల్లో పడక తప్పదు.
వెంచర్ వేసే బిల్డర్, స్థల యజమాని మధ్య వివాదం వస్తే అది ఎలా ఉంటుందో ఇప్పుడు సీఆర్డీఏ, రైతుల మధ్య వివాదం కూడా అలాగే ఉంటుంది. ఇంతకు మించి అక్కడ జరిగేది, జరగబోయేది ఏమీ ఉండదు. అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. భూములు అమ్మి కార్లు కొన్నారు. నగలు కొన్నారు. భవంతులు కట్టుకున్నారు. విదేశీ విహార యాత్రలు చేశారు. ఇవన్నీ కాదనలేని నిజాలు. నెమ్మదిగా అయినా నిజాలు బయటపడక తప్పదు.
Also Read: మూడవసారి కూడా రాజధాని విషయంలో అదే తప్పు జరిగితే ?
రాష్ట్ర విభజనప్పుడు ఇలాంటి సవాళ్ళే అంటే కోర్టులో అడ్డుకుంటాం అంటూ ప్రకటనలు చేసి రాష్ట్రానికి ఏమి కావాలో అడగకుండా లక్షగళార్చన పేరుతొ సభలు జరిపిన వారు అధికారంలోకి వొచ్చిన తరువాత ప్రత్యేకహోదాను కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో పెట్టలేడు.. ఇప్పుడేమి చేయలేము అంటూ చేతులెత్తేసిన దానికి ఇప్పుడు రైతులు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకుండా చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగుతున్న దానికి తేడా ఏమి లేదు…
Status Quo , Stay రెండిటికి తేడా లేదన్నట్లు రాసిన ఈ పత్రికలే గతంలో సమైక్యాంద్రపోరాటం విజయం సాధిస్తుందని రాసింది ..నిండా మునిగింది నాడు ప్రజలు ,నేడు మునగబోతున్నది రైతులు…రైతులు తమ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తో చర్చలకు వెళ్ళాలి..