iDreamPost
android-app
ios-app

మేము ఉల్లిపాయ తినం–అయితే అవకాడో తింటారా?

మేము ఉల్లిపాయ తినం–అయితే అవకాడో తింటారా?

ఐఎన్ఎక్స్ అక్రమ నగదు కేసులో అరెస్టయిన చిదంబరానికి బుధవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో తన గళాన్ని ప్రభుత్వం తొక్కేయలేదని తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ పెరిగిన ఉల్లిధరలపై చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఉల్లి గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఉల్లిపాయ తిననని ఆర్ధిక మంత్రి చెప్పారు..? దీనికి అర్థం ఏమిటి? అంటే ఆవిడ అవకాడో తింటారా అని విమర్శించారు.

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తను ఉల్లిపాయలు తిననని, తన కుటుంబంలో ఎవరూ ఉల్లిపాయలు తినరని, తన కుటుంబం ఉల్లిపాయకు వెల్లుల్లికి దూరమని తెలిపారు. కాబట్టి పెరుగుతున్న ఉల్లి ధరలపై నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలతో విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లిధరల నియంత్రణకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించామని, ఉల్లిని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని నిర్మల తెలిపారు. ఉల్లి ఎక్కువ స్టాక్ ఉన్న ప్రదేశాల నుండి తక్కువ స్టాక్ ఉన్న ప్రదేశాలకు బదిలీ చేయనున్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.