టాలీవుడ్ లో టాప్ ఫామ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. చేతిలో ఉన్న సినిమాలతో పాటు ఇంకా సైన్ చేయించుకోవాల్సిన నిర్మాతల క్యూ చాంతాడంత ఉంది. మరోవైపు బాలీవుడ్ ఆఫర్లు టెంప్ట్ చేసేలా వస్తున్నాయి. ప్రస్తుతం రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డే త్వరలో నాగ చైతన్యతో జోడి కట్టవచ్చని లేటెస్ట్ అప్ డేట్. ఈ కాంబో గతంలోనే వచ్చింది. పూజా కెరీర్ ప్రారంభంలో చేసిన రెండో సినిమా ఒక లైలా కోసం హీరో చైతునే. కాకపోతే ఆది ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఆ తర్వాతే పూజాకు కొంత గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు రెండోసారి జోడికడితే అంతకన్నా అక్కినేని ఫాన్స్ కోరుకునేది ఏముంటుంది. ఆల్రెడీ తమ్ముడు అఖిల్ తో బ్యాచిలర్ రొమాన్స్ చేసింది. ఇప్పుడు అన్నయ్యతో అంటే పండగేగా. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్ యు కోసం తనను అడిగినట్టు తెలిసింది. కథ నచ్చి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. కాల్ షీట్స్ చూసుకుని ఆపై చెబుతానని సమాచారం ఇచ్చినట్టు వినికిడి. సల్మాన్ ఖాన్ తో హిందీలో చేస్తున్న ప్రాజెక్ట్ తో పాటు ఆచార్యలో రామ్ చరణ్ సరసన కూడా పూజా హెగ్డే నటిస్తోంది. వీటి డేట్లు సర్దుబాటు చేశాకే థాంక్ యుకు ఇవ్వాల్సి వస్తుంది.
అందుకే ప్రస్తుతానికి డెసిషన్ పెండింగ్ లో ఉన్నట్టు తెలిసింది. థాంక్ యు షూటింగ్ వేగంగా జరుగుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చైతు నటిస్తున్న ఈ మూవీలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారట. డీటెయిల్స్ ఎక్కువగా బయటికి రాకుండా యూనిట్ జాగ్రత్త పడుతోంది. ఈ ఏడాదే దీన్ని ప్లాన్ చేస్తున్నారు. లవ్ స్టోరీ ఎలాగూ మేలో వచ్చేస్తుంది కాబట్టి థాంక్ యు వీలైతే దసరా లేదా నాగ్ కు సెంటిమెంట్ నెలైన డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మజిలీ సూపర్ హిట్ తర్వాత రెండేళ్ల గ్యాప్ వచ్చిన చైతన్య ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పలకరించబోతున్నాడు.