iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియా బాధితుల జాబితాలో న్యాయమూర్తులు

సోషల్ మీడియా బాధితుల జాబితాలో న్యాయమూర్తులు

  ఆనంద్ సోషల్ మీడియా వల్ల న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా వెల్లడించారు. కొన్ని తీర్పులకు సం బంధించి సోషల్‌ మీడియాలో న్యాయమూర్తుల పై చేస్తున్న విమర్శలు బాధిస్తున్నాయని సుప్రీంకోర్టు తదుపరి ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ ఆనంద్‌ బోబ్డే అన్నారు. తమను వేధిస్తున్నారని న్యాయమూర్తులు ఆవేదన చెందుతుంటే పట్టించుకోకుండా ఉండలేమని చెప్పారు.

ఈ నెల 18న సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సగా ప్రమాణం చేయనున్న జసిస్‌ బోబ్డే ఆదివారం ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సోష ల్‌ మీడియాలో న్యాయమూర్తుల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. ఇది కోర్టుల పనితీరును ప్రభావితం చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో జడ్జీల తీర్పులనుగాక న్యాయమూర్తులను విమర్శించడం పరువునష్టం నేరం కింద కు వస్తుంది. జడ్జీలు కూడా మానవమాత్రులేనని గుర్తించాలి. న్యాయమూర్తులను వేధించడాన్ని ఎవరూ అంగీకరించరు.’ అన్నారు.

అయితే సోషల్‌ మీడియా విమర్శలను అడ్డుకోవడానికి ప్రస్తుతం సుప్రీంకోర్టు చేయగలిగిందేమీ లేదని శరద్ నిస్సహాయత వ్యక్తం చేశా రు. ప్రజల, జడ్జీల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని.. పైపెచ్చు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆక్షేపించారు. ‘న్యాయం అనవసరంగా ఆలస్యం కాకూడదు. అనవసరంగా తొందర కూడా పడకూడదు. అలాగని తక్షణ న్యాయం ఉండాలని అనుకోరాదు. సకాలంలో న్యాయం అందాలి. అనవసర జాప్యం జరిగితే నేరాలు పెరగడానికి దారితీస్తుంది. ఆర్థిక దావాలను సత్వరమే పరిష్కరించకపోతే దౌర్జన్యాలు పెరుగుతాయి. కండబలం ప్రయోగించే అవకాశమూ ఉంది. చట్టపాలన క్షీణిస్తుంది. న్యాయవ్యవస్థ అవసరాలేంటో, మౌలిక వసతులలేమి గురించి ప్రభుత్వానికి బాగా తెలుసు. వసతుల కల్పనలో కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. సత్వర న్యాయానికి కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలి.

ఇది న్యాయమూర్తులకు బాగా ఉపకరిస్తుంది’ అని సూచించారు. కీలక అంశాలపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు దీనిపై నిర్ధిష్ట అభిప్రాయాలు ఉన్నాయని, ఆయనెలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉందని జస్టిస్‌ బోబ్డే బదులిచ్చారు. దేశంలోని పలు కోర్టుల్లో ఖాళీ జడ్జీల పోస్టుల భర్తీకి, మౌలిక వసతుల కల్పనకు జస్టిస్‌ గొగోయ్‌ చేపట్టిన చర్యలు ఫలవంతమయ్యేలా చూస్తానన్నారు. న్యాయవాదుల తీవ్ర వాదోపవాదాల నడుమ అయోధ్య కేసులో నిరంతరాయంగా రోజువారీ విచారణ ఎలా చేపట్టగలిగారని ప్రశ్నించగా.. సీటులో నుంచి లేవగానే దాని గురించి మరచిపోతానని బదులిచ్చారు.