iDreamPost
android-app
ios-app

నెంబర్ మారనున్న మెగా ప్రాజెక్ట్స్

  • Published Aug 03, 2020 | 7:39 AM Updated Updated Aug 03, 2020 | 7:39 AM
నెంబర్ మారనున్న మెగా ప్రాజెక్ట్స్

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యకు లాక్ డౌన్ వల్ల బ్రేక ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో షూటింగ్ తిరిగి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ నెలే అన్నారు కానీ హైదరాబాద్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అందుకే సెప్టెంబర్ కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు దీని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడీ సిరీస్ లో కొత్త ట్విస్టు వచ్చి పడేలా ఉంది. స్క్రిప్ట్ పూర్తి సంతృప్తికరంగా రాని కారణంగా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు, ప్రాజెక్ట్ ని వివి వినాయక్ చేతిలో పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. దీన్ని సమర్ధిస్తూ ఖండిస్తూ ఎలాంటి స్టేట్ మెంట్స్ రాలేదు.

తాజా అప్ డేట్ ప్రకారం లూసిఫర్ రీమేక్ కన్నా ముందు దర్శకుడు బాబీ సినిమా ముందుగా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ నెల 22న చిరు పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. ఫైనల్ వెర్షన్ ని చిరంజీవికి నచ్చేలా నెరేట్ చేయడంతో ముందు ఇది లైన్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వినికిడి. అయితే ఇంకో ఇరవై రోజులు ఆగితే కానీ స్పష్టత వచ్చే ఛాన్స్ తక్కువే. ఈలోగా సుజిత్ వేరే హీరోతో యువి బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడట. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి చిరుతో మూవీ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఇలా అయితే లూసిఫర్ ని డ్రాప్ అవ్వడమే బెటరనే అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన సినిమాను మళ్ళీ రీమేక్ చేయడం అంత వర్కవుట్ కాదని కాటమరాయుడుని ఉదాహరణగా చూపిస్తున్నారు.

మరి హక్కుల కోసం పెట్టిన పెట్టుబడి పోతే పోయిందని వదిలేస్తారో లేక ఎంతో ముచ్చటపడి కొనుకున్న చిత్రం కాబట్టి తర్వాతైనా తీస్తారో వేచి చూడాలి. ఈ పుట్టినరోజుకే ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారట. తొలుత టీజర్ అనుకున్నప్పటికీ సాధ్యం కాకపోవచ్చని తెలిసింది.. ఆచార్య టైటిల్ కూడా చిరు ఓ ఫంక్షన్ లో స్లిప్ అయ్యి చెప్పిందే తప్ప నిజానికి ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సైరా తర్వాత చేస్తున్న మూవీగా దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సో మెగా ప్రాజెక్ట్స్ నెంబర్స్ కు సంబంధించి క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాలి