iDreamPost
iDreamPost
నేడు సభలో స్పీకర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ 1995లో ఎన్.టి రామారావుని ముఖ్యమంత్రి పదవి నుండి దింపేసి (దీనినే వెన్నుపోటు అంటారు) అసెంబ్లీలో చంద్రబాబు బల నిరూపణ చేసుకోవాల్సిన సమయం వచ్చేసరికి రామారావుని ఎంత ఏడిపించారో గుర్తు చేసుకున్నారు.
Also Read : వైశ్రాయ్ – స్పీకర్ పశ్చాత్తాపం
వెంటనే ఆ సమయంలో స్పీకర్ గ వ్యవహరించిన యనమల రామకృష్ణుడు ఈ ఉదంతం పై అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆనాడు పరిణామాలు వేరు అని , రామారావుని బి.ఏ.సి సమావేశానికి ఎందుకు పిలవలేదనే అంశంపై సభలో మాట్లాడతానని కోరారు అని అప్పటికే టి.డి.యల్.పి నేతగా చంద్రబాబుని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని, నిబందనల ప్రకారం ప్లోర్ లీడర్లని మాత్రమే బి.ఏ.సికి పిలిస్తాం అని ఎనమల చెప్పుకొచ్చారు.
స్పీకర్ తమ్మినేని, మాజీ స్పీకర్ యనమల వాఖ్యలతో ఆ రోజు ఏమి జరిగింది , ఎవరు నిబందనలు పాటించారు, రామారావుని ఎందుకు మాట్లాడనివ్వలేదు అనే చర్చ మరొకసారి సభ ముందుకు వచ్చింది. అలాగే యనమల రామకృష్ణుడు చెబుతున్నదాట్లో వాస్తవం ఎంత అనే వాదన నాటి సీనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు మరికొంతమంది తెరపైకి తీసుకొచ్చారు .
రెండవసారి ముఖ్యమంత్రి అయిన రామారావుని సొంత బిడ్డలు , ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో వెన్నుపోటు పొడిచి వైస్రాయి హోటల్ ముందు చెప్పుల ఉదంతం నడిపి ముఖ్యమంత్రి పీఠం నుండి దింపేసిన తరువాత 1995 సెప్టెంబర్ 7న అసెంబ్లీలో చంద్రబాబుకు తన బలం నిరూపించుకునే సమయం వచ్చింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు విశ్వాస ప్రతిపాధన కోసం సభ సమావేశం అయింది.
అయితే ఈ సభలో రామారావుని మాట్లాడేందుకు గానీ , తన గోడు చెప్పుకునేందుకు గానీ అప్పటి స్పీకర్ అయిన యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు. నేడు యనమల రామకృష్ణుడు చెబుతునట్టు ఆనాడు రామారావు గారు మొదట స్పీకర్ ని మాట్లాడటానికి అడిగింది బి.ఏ.సి విషయం కాదు . రామారావు మొదట స్పీకర్ ని కోరింది , బల నిరూపణ కన్నా ముందు నన్ను ముఖ్యమంత్రి పీఠం నుండి కుట్రపూరితంగా దింపేసారు ఈ పరిణామాలకు దారితీసిన సంఘటనలను నేను ప్రజలకు వివరించాలి , బలనిరుపణ కన్నా ముందు నాకు ఈ అవకాశం ఇవ్వండి అని కోరారు, దీనికి నాడు స్పీకర్ గా వ్యవహరించిన యనమల గారు ఒప్పుకోలేదు.
Also Read : ఎన్టీఆర్ ను అందుకే మాట్లాడనీయలేదు – యనమల
అలాగే నేడు యనమల మాట్లాడుతూ అప్పటికే టి.డి.యల్.పి నేతగా చంద్రబాబుని శాసన సభ్యులు ఎన్నుకున్నారు అని చెప్పారు. కాని నాడు సభలో ప్రతిపక్షనేతగా ఉన్న పి. జనార్ధన రెడ్డి గారు అడిగిన మొదటి ప్రశ్న టి.డి.యల్.పి లీడర్ తానే అని ఎన్.టి రామారావు అంటున్నారు , అలాగే టి.డి.యల్.పి లీడర్ తానే అని చంద్రబాబు అంటున్నారు ఇద్దరు సభ్యులకి విప్ జారీ చేశారు, ఆ విప్ లలో ఎవరు జారీచేసిన విప్ సరైనదో, ఓట్ ఆఫ్ కాంఫిడెన్స్ మోషన్ తీసుకునే ముందు ఎవరిని డిస్క్వాలిఫై చేస్తున్నారో, ఎవరిని గుర్తిస్తున్నారో చెప్పమన్నారు.
ఏ ప్రాతిపదికన అసలు టి.డి.యల్.పి లీడర్ ను మీరు గుర్తించారో చెప్పమని కోరారు. దీనికి యనమల నాడు సమాధానం దాటవేశారు.
ఇలా నాడు అడుగడుగునా ఉల్లంఘనలే జరిగాయి అనే వాదన ఉన్నది . దీనితో పాటు బాబూ అండ్ కో ఆనాడు రామారావుని తన మాటలతో , చేష్టలతో అనేక విధాలుగా క్షోభకి గురిచేసారు.
ఆనాడు అసెంబ్లీలో జరిగిన సంభాషణలలో ఒక భాగం ఇది
ఎన్.టి.ఆర్ : అధ్యక్షా !! నన్ను ఆఫీసు నుండి విసిరి పారేశారు . నన్ను గెలిపించిన ప్రజలకి ఈ అసెంబ్లీ ద్వారా ఏమి జరిగిందో నేను చెప్పాలి. కనీసం ఒక సభ్యుడికి ఉన్న హక్కుగానైనా నన్ను మాట్లాడనివ్వండి..
యనమల రామ కృష్ణుడు : అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టాక మాట్లాడండి.
ఎన్.టి.ఆర్ : రాజీనామా చేసిన (ముఖ్యమంత్రిగా) నాకు స్టేట్మెంట్ ఇచ్చే అధికారం ఉంది. మాట్లాడనివ్వండి..
యనమల రామ కృష్ణుడు : అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టక మాట్లాడండి.
ఎన్.టి.ఆర్ : అధ్యక్షా !! 29 వ తారీఖున జరిగిన బి.ఏ.సి మీటింగ్ కి నన్ను ఎందుకు పిలవలేదు ? నేను ఇంకా తెలుగుదేశం అధ్యక్షుడినే.
యనమల రామ కృష్ణుడు: నేను మీకు చెబుతాను..
ఎన్.టి.ఆర్ : అధ్యక్షా మీరు ప్రెస్ లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇంకా లీడర్ గా ఎవరినీ గుర్తించలేదు అని…
యనమల రామకృష్ణుడు : ఆ మాట ఇప్పుడు ఇక్కడ అసందర్భం. who cares ??
ఇంద్రారెడ్డి : అధ్యక్షా మీరు ఎన్.టి.ఆర్ గారిని who cares అన్నారు . క్షమాపణలు చెప్పాలి
యనమల రామకృష్ణుడు : నేను అనలేదు, అనలేదు , అనలేదు.
గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు : shame మాకు కాదు. మీకు
గోరంట్ల బుచ్చయ్య చౌదరి: ఇదంతా స్పీకర్ గారి కుట్ర
ఎన్.టి.ఆర్ : అధ్యక్షా ఇంతకంటే నన్ను అసెంబ్లీకి రావద్దంటే సరిపోయేది……
రామారావు గారు తరుపున నిలబడిన వారిని స్పీకర్ యనమల సస్పెండ్ చేసి మార్షల్స్ చేత బయటకి లాగేయించారు – చంద్రబాబు మద్దతు దారులు చంద్రబాబు జిందాబాద్ అని కేకలు వేసారు అంతే కాకుండా రామారావు నేను ఇంకా (టి.డి.ఎల్.పి) లీడర్ ని అంటే బాబు మద్దతు దారులు ఆహా ఓహో అని అసెంబ్లీలో రామారావుని ప్రత్యక్షంగ ఎద్దేవా చేశారు. బయటికి వచ్చిన రామారావు ఆరోజుని అసెంబ్లీ చరిత్రలో ఒక చీకటి యుగంగా అభివర్ణించారు .
Also Read : హెరిటేజ్ ఎవరిది ??
అనాడు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు ఒకరి విప్ కాదు అని మరొకరి విప్ ని ఎలా పరిగణలొకి తీసుకున్నారో, ఆనాడు యాంటి డిఫెక్షన్ లా ఎందుకు పనిచేయలేదు లాంటి అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాదానంలేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి .