iDreamPost
android-app
ios-app

‘హాట్‌’ యాంగిల్‌లో చూడొద్దంటున్న హాట్‌ హీరోయిన్‌

‘హాట్‌’ యాంగిల్‌లో చూడొద్దంటున్న హాట్‌ హీరోయిన్‌

కన్నడ బ్యూటీ అక్షర గౌడ, తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు-2’లో చాలా తక్కువ నిడివి పాత్రలో కన్పించింది. మోడలింగ్‌ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ, సరైన ఛాన్సొస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానని చెబుతోంది. అయితే, తన వద్దకు వస్తున్నవన్నీ గ్లామరస్‌ రోల్స్‌ మాత్రమేననీ, పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌తో తనను అప్రోచ్‌ అవుతోన్నవారి సంఖ్య చాలా తక్కువగా వుంటోందనీ వాపోతోంది. నిజానికి, చాలామంది గ్లామరస్‌ హీరోయిన్‌ ఇమేజ్‌నే కోరుకుంటారు. కానీ, కేవలం గ్లామరస్‌ ఇమేజ్‌తోనే నెట్టుకొచ్చేయాలంటే అది కష్టమైన పనే. ఓ సారి సక్సెస్‌ అయితే, దానికి గ్లామర్‌ అదనపు అడ్వాంటేజ్‌ అవుతుంది. మరోపక్క, అస్సలేమాత్రం యాక్టింగ్‌ స్కిల్స్‌ లేని బామలకీ లక్‌ కలిసొస్తుంటుంది. సో, ఇక్కడ లక్‌ అనేది చాలా ముఖ్యమన్నమాట. ఆ లక్‌ కోసం తానూ ఎదురుచూస్తున్నాననీ, సరైన ఛాన్స్‌ దొరికితే సత్తా చాటుతాననీ చెబుతోంది అక్షర గౌడ. ప్రస్తుతం కన్నడ, తమిళంలో పలు సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ, తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కన్నడ బ్యూటీ రష్మిక మండన్న టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న విషయం విదితమే. సో, ఇంకో కన్నడ బ్యూటీ అక్షర కూడా ముందు ముందు టాలీవుడ్‌లో సత్తా చాటుతుందేమో చూడాలిక. ‘హాట్‌ యాంగిల్‌’లో నన్ను చూడొద్దు.. అని అంటోందిగానీ, ఆమె ఫొటో సెషన్లన్నీ.. హై ఓల్టేజ్‌ హాట్‌ కంటెంట్‌ కలిగినవే మరి.