iDreamPost
నిర్మాత మిద్దె రామారావుకు చిరు ఓ కమిట్ మెంట్ ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో ఈ సబ్జెక్టు అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది. స్క్రిప్ట్ ప్లస్ సంభాషణల బాధ్యతలు సత్యానంద్ కు అప్పగించారు. హీరోయిన్ గా రాధిక ఎంపికయ్యింది. ఇది వీళ్లిద్దరి కలయికలో మొదటి సినిమా. ఆ తర్వాత ఈ జంట ఎన్ని బ్లాక్ బస్టర్లలో నటించారో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు
నిర్మాత మిద్దె రామారావుకు చిరు ఓ కమిట్ మెంట్ ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో ఈ సబ్జెక్టు అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది. స్క్రిప్ట్ ప్లస్ సంభాషణల బాధ్యతలు సత్యానంద్ కు అప్పగించారు. హీరోయిన్ గా రాధిక ఎంపికయ్యింది. ఇది వీళ్లిద్దరి కలయికలో మొదటి సినిమా. ఆ తర్వాత ఈ జంట ఎన్ని బ్లాక్ బస్టర్లలో నటించారో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు
iDreamPost
ఇప్పుడంటే నెగటివ్ టైటిల్స్ తో హిట్లు కొట్టడం మామూలైపోయింది కానీ ఈ ట్రెండ్ కి ఒక ఊపును తీసుకొచ్చింది చిరంజీవనే చెప్పాలి. ఓ ఉదాహరణ చూద్దాం. 1983 సంవత్సరం. అప్పటికే చిరంజీవికి ఖైదీ రూపంలో వచ్చిన బ్రేక్ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని పెంచింది. దర్శకులు ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే పిచ్చ క్రేజ్ ఏర్పడింది. మళ్ళీ ఈ కలయికలో ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్న టైంలో ప్రముఖ రచయిత గిరిజశ్రీ భగవాన్ రాసిన ఓ కథ రెడ్డిగారికి బాగా నచ్చేసింది. ఇందులో పాయింట్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు మలుచుకోవచ్చనే ఆలోచనతో చిరంజీవిని కలిశారు. ఆయనా కాంబో కోసం ఎదురు చూస్తున్నారు.
నిర్మాత మిద్దె రామారావుకు చిరు ఓ కమిట్ మెంట్ ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో ఈ సబ్జెక్టు అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు ముందుకు కదిలింది. స్క్రిప్ట్ ప్లస్ సంభాషణల బాధ్యతలు సత్యానంద్ కు అప్పగించారు. హీరోయిన్ గా రాధిక ఎంపికయ్యింది. ఇది వీళ్లిద్దరి కలయికలో మొదటి సినిమా. ఆ తర్వాత ఈ జంట ఎన్ని బ్లాక్ బస్టర్లలో నటించారో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. సత్యనారాయణ, రావుగోపాల్ రావు, అల్లు రామలింగయ్య, అన్నపూర్ణ, సిల్క్ స్మిత, సుత్తివేలు, హేమసుందర్ తదితరులు ఇతర తారాగణం. సంగీత దర్శకులు చక్రవర్తి మరోసారి మాస్ కి కిక్కిచ్చే పాటలతో మరో సూపర్ హిట్ ఆల్బమ్ సిద్ధం చేశారు.
రాజా(చిరంజీవి) చిన్నప్పుడు తెలియక చేసిన తప్పు వల్ల ఓ మనిషి కళ్ళు పోవడానికి కారణం అవుతాడు. పోలీసైన తండ్రి (సత్యనారాయణ)కి భయపడి ఇల్లొదిలి పారిపోతాడు. కాళిదాసుగా పేరు మార్చుకుని గూండా అవతారం ఎత్తుతాడు. అనూహ్యమైన పరిస్థితిలో తన కుటుంబం దగ్గరికే చేరతాడు. అలా కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇందులో క్లైమాక్స్ ఫ్లైట్ లో కదులుతున్న ట్రైన్ పై బ్రిడ్జ్ మీద చిరంజీవి చేసిన ఫైట్ ఒళ్ళు గగుర్పొడిచేలా సాగడం అప్పట్లో సంచలనం. 1984 ఫిబ్రవరి 23 విడుదలైన గూండా మరీ ఖైదీ స్థాయిలో కాదు కానీ కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. చిరుకి మాస్ ఇమేజ్ కి మరో మెట్టులా తోడ్పడింది
Also Read : Dharmakshetram : పాటలు బాగున్నా కంటెంట్ ముఖ్యం – Nostalgia