iDreamPost
రాజీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కేసి రెడ్డి బాలయ్యతో తీసిన 'రక్తాభిషేకం'(1989)గొప్పగా ఆడకపోయినా డీసెంట్ హిట్ అందుకుని నష్టాలు రాకుండా కాపాడింది. దీనికి ఏ కోదండరామిరెడ్డి దర్శకులు. ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అంతకన్నా గొప్ప సినిమా ఇవ్వాలన్నా ఉద్దేశంతో పరుచూరి బ్రదర్స్ ని కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కథే ధర్మక్షేత్రం.
రాజీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కేసి రెడ్డి బాలయ్యతో తీసిన 'రక్తాభిషేకం'(1989)గొప్పగా ఆడకపోయినా డీసెంట్ హిట్ అందుకుని నష్టాలు రాకుండా కాపాడింది. దీనికి ఏ కోదండరామిరెడ్డి దర్శకులు. ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అంతకన్నా గొప్ప సినిమా ఇవ్వాలన్నా ఉద్దేశంతో పరుచూరి బ్రదర్స్ ని కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కథే ధర్మక్షేత్రం.
iDreamPost
కొన్ని సినిమాలు ఎంత పెద్ద ఫ్లాప్ అయినా అందులో పాటలు మాత్రం చిరకాలం గుర్తుండపోతాయి. సంగీత ప్రేమికుల అభిమానాన్ని శాశ్వతంగా సంపాదించుకుంటాయి. ఓ ఉదాహరణ చూద్దాం. 1991. అప్పటికే బాలయ్యకు మాస్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్. ‘ముద్దుల మావయ్య’ ఫ్యామిలీ ఆడియన్స్ లో పేరు తీసుకురాగా ‘లారీ డ్రైవర్’ కమర్షియల్ జానర్ లో బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అయినా కుటుంబ ప్రేక్షకులను మర్చిపోకుండా చేసిన నారి నారి నడుమ మురారి, తల్లితండ్రులు ఆ ఇమేజ్ ని నిలబెడుతూ వచ్చాయి. ‘ఆదిత్య 369’ ప్రయోగం తెలుగులోనే కాదు ఇతర బాషల హీరోలను దర్శకులనూ మెప్పించింది.
రాజీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కేసి రెడ్డి బాలయ్యతో తీసిన ‘రక్తాభిషేకం'(1989)గొప్పగా ఆడకపోయినా డీసెంట్ హిట్ అందుకుని నష్టాలు రాకుండా కాపాడింది. దీనికి ఏ కోదండరామిరెడ్డి దర్శకులు. ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అంతకన్నా గొప్ప సినిమా ఇవ్వాలన్నా ఉద్దేశంతో పరుచూరి బ్రదర్స్ ని కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చిన కథే ధర్మక్షేత్రం. అప్పటిదాకా బాలకృష్ణ ఫుల్ లెన్త్ లాయర్ గా నటించలేదు. దీంతో అభిమానులతో పాటు జనం కూడా కొత్తగా ఫీలవుతారనే ఉద్దేశంతో అన్ని అంశాలు సంపూర్ణంగా జోడించి ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. అసెంబ్లీ రౌడీ, బొబ్బిలిరాజాతో ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న దివ్యభారతిని హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.
ఇళయరాజా సంగీతం అనగానే క్రేజ్ పెరిగింది. విన్సెన్ట్ వెంకట్ లు ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నారు. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. నగరంలో కక్షలతో రగిలిపోతున్న ఇద్దరు రౌడీ ముఠాల ఆగడాలను అరికట్టేందుకు ఒక న్యాయవాది కంకణం కట్టుకోవడం మీద ఈ సినిమాను రన్ చేశారు. మంచి ప్లాట్ అయినప్పటికీ ప్రెజెంటేషన్ లో ల్యాగ్ తో పాటు అవసరం లేని సన్నివేశాలు, పాటల మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద పెట్టకపోవడం లాంటి కారణాలు ఫ్లాప్ కు దారి తీశాయి. అయినా కూడా ఆడియో సూపర్ హిట్ కావడం ట్విస్ట్. 1992 ఫిబ్రవరి 14న విడుదలైన ధర్మక్షేత్రం అంచనాలు అందుకోలేకపోయింది. పాటలు మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. అదే రోజు రిలీజైన మోహన్ బాబు అల్లరి మొగుడు భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ కావడం కొసమెరుపు.