iDreamPost
అందుకే ఎన్నో గొప్ప చిత్రాలు దైవచింతన ఆధారంగా చేసుకుని వచ్చాయి. వాటిలో కొన్ని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. అందులో ఒకటి భక్త కన్నప్ప. 1976. తన స్వంత నిర్మాణ సంస్థ గోపికృష్ణ బ్యానర్ పై కృష్ణంరాజు అప్పటికే కృష్ణవేణి రూపంలో ప్రొడ్యూసర్ గా డెబ్యూ హిట్ అందుకున్నారు.
అందుకే ఎన్నో గొప్ప చిత్రాలు దైవచింతన ఆధారంగా చేసుకుని వచ్చాయి. వాటిలో కొన్ని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. అందులో ఒకటి భక్త కన్నప్ప. 1976. తన స్వంత నిర్మాణ సంస్థ గోపికృష్ణ బ్యానర్ పై కృష్ణంరాజు అప్పటికే కృష్ణవేణి రూపంలో ప్రొడ్యూసర్ గా డెబ్యూ హిట్ అందుకున్నారు.
iDreamPost
నిజం చెప్పాలంటే సరిగ్గా పండించాలే కానీ భక్తికి మించిన ఎమోషన్ లేదు. రోజూ సినిమా చూడకపోతే ఏం జరగదు కానీ దేవుడికి ఓసారైనా దండం పెట్టని వాళ్ళు చాలా అరుదు. అందుకే ఎన్నో గొప్ప చిత్రాలు దైవచింతన ఆధారంగా చేసుకుని వచ్చాయి. వాటిలో కొన్ని ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. అందులో ఒకటి భక్త కన్నప్ప. 1976. తన స్వంత నిర్మాణ సంస్థ గోపికృష్ణ బ్యానర్ పై కృష్ణంరాజు అప్పటికే కృష్ణవేణి రూపంలో ప్రొడ్యూసర్ గా డెబ్యూ హిట్ అందుకున్నారు. రెండోది తనకు ఎంతో ఇష్టమైన కన్నప్ప కథను తెరకెక్కించాలన్న సంకల్పం కలిగింది. కారణం 1954లో వచ్చిన రాజ్ కుమార్ కన్నడ చిత్రం బేడర కన్నప్ప విపరీతంగా నచ్చేయడమే.
దర్శకుడితో సహా ముందు వేరే టీమ్ అనుకున్నారు కానీ అది కొంత కాలం ముందుకు సాగలేదు. అదే సమయంలో ముత్యాల ముగ్గుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాపుగారు దీన్ని టేకప్ చేసేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలతో కూడిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయగా విఎస్ఆర్ స్వామికి ఛాయాగ్రహణం, సత్యంకు సంగీతం బాధ్యతలు అప్పగించారు. వాణిశ్రీ హీరోయిన్ గా, శ్రీధర్ – బాలయ్య – ప్రభాకర్ రెడ్డి – రావుగోపాలరావు-ముక్కామల-పిఆర్ వరలక్ష్మి తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. ఇప్పటి ప్రముఖ కెమెరామెన్ కం నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి దీనికి అసిస్టెంట్ గా చేశారు.
బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేసింది. ఆశ్రమాలు, విగ్రహాలు, దుస్తులు ఒకటా రెండా డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు కృష్ణంరాజు, ఆయన సోదరుడు సూర్యనారాయణరాజు(ప్రభాస్ తండ్రి). ఆ టైంలోనే ఇరవై లక్షల బడ్జెట్ అంటే మాటలు కాదు. అయినా వెనుకడుగు వేయలేదు. పట్టిసీమ, బుట్టాయిగూడెం తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. 12 అద్భుతమైన పాటలు కుదిరాయి. దీంతోనే రామకృష్ణ స్టార్ సింగర్ అయ్యారు. కండ గెలిచింది, ఎన్నియల్లో పాటల షూటింగ్ కి జరిగిన వ్యయప్రయాసల గురించి ఒక పుస్తకమే రాయొచ్చని అంటారు అప్పటి యూనిట్ సభ్యులు. 1976 మే 29న విడుదలైన భక్త కన్నప్ప కమర్షియల్ సినిమాల హవాలోనూ గొప్ప విజయం సాధించి వంద రోజుల పండగ జరుపుకుని కృష్ణంరాజు పెట్టిన ఖర్చుని లాభాలతో సహా మొత్తం వెనక్కు ఇచ్చేసింది.
Also Read : Goonda : రిస్కీ ఫైట్లతో చిరంజీవి సాహసం – Nostalgia