iDreamPost
1980. దర్శకుడిగా దాసరి నారాయణరావు గారి వైభవం ఓ రేంజ్ లో వెలిగిపోతోంది. నిర్మాతలు ఆయన కాల్ షీట్ల కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరిని కరుణించాలో అర్థం కానంత గొప్ప స్థితిలో ఉన్నారు.
1980. దర్శకుడిగా దాసరి నారాయణరావు గారి వైభవం ఓ రేంజ్ లో వెలిగిపోతోంది. నిర్మాతలు ఆయన కాల్ షీట్ల కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరిని కరుణించాలో అర్థం కానంత గొప్ప స్థితిలో ఉన్నారు.
iDreamPost
1980. దర్శకుడిగా దాసరి నారాయణరావు గారి వైభవం ఓ రేంజ్ లో వెలిగిపోతోంది. నిర్మాతలు ఆయన కాల్ షీట్ల కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరిని కరుణించాలో అర్థం కానంత గొప్ప స్థితిలో ఉన్నారు. ఎన్టీఆర్ తో నుంచి చిన్న హీరోల దాకా అందరితో చేసేసిన అనుభవం వచ్చేసింది. అంజనీకుమార్ అనే ఓ చిన్న ప్రొడ్యూసర్ దర్శకరత్నతో సినిమా తీయాలని అప్పటికి ఆరేడేళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు. మొదట్లో ప్రయత్నిస్తే తప్పకుండా చేద్దామని మాట ఇచ్చిన దాసరి ఆ తర్వాత పనుల ఒత్తిడిలో మర్చిపోయారు. పీక్స్ లో ఉన్న ఈయన ఇమేజ్ చూసి అంజనీకుమార్ ఒకదశలో అడిగేందుకు కూడా సంశయించి ఆగిపోయారు.
ఇలా లాభం లేదని ఓరోజు దాసరి అక్కినేని నాగేశ్వరరావు గారితో షూటింగ్ లో ఉండగా ధైర్యం చేసి అడిగేశారు. ఎప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి దాసరి అంజనీకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్షలు కోట్లు పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నా తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీసెంట్ బడ్జెట్ తో పూర్తయ్యేలా తనకు బాగా ఇష్టమైన అద్దాల మేడ చేసేందుకు ఒప్పుకున్నారు దాసరి నారాయణరావు. అది యాభైవ సినిమా కావడం యాదృచ్చికం. సినిమా వాళ్ళ జీవితాలనే ఓ పల్లెటూరి నేపథ్యంగా తీసుకుని దాసరి గారు అద్భుతమైన కథను అల్లారు. చిన్న చిత్రమే అయినా క్యాస్టింగ్ విషయంలో రాజీ పడలేదు. ఆర్టిస్టులూ డిమాండ్ చేయలేదు.
మోహన్ బాబు, మురళిమోహన్, ప్రభాకర్ రెడ్డి, చలం, గోకిన రామారావు, అంబిక, గీత, నిర్మలమ్మ, నళినీకాంత్, నారాయణమూర్తి ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. కీలకమైన డైరెక్టర్ పాత్రను దాసరి గారే పోషించడం గొప్ప ప్లస్ అయ్యింది. రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చగా కెఎస్ మణి ఛాయాగ్రహణం అందించారు. విడుదలకు ముందే వేసిన ప్రివ్యూలకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రముఖులు దాసరిగారిని అభినందనలతో ముంచెత్తారు. 1981 నవంబర్ 7 విడుదలైన అద్దాల మేడకు ప్రేక్షకుల ఆదరణ దక్కి సూపర్ హిట్ అందుకుంది. కేవలం వారం రోజుల ముందు రిలీజైన చట్టానికి కళ్ళు లేవుతో పాటు రెండూ విజయం సాధించాయి.
Also Read : Ganga Manga : రాముడు భీముడు ఫార్ములాతో హీరోయిన్ సినిమా – Nostalgia