iDreamPost
android-app
ios-app

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా

సామాన్యులు ప్రముఖులు అనే తేడా లేకుండా కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు నాయకులు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా 30 మంది ఎంపీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా నిర్దారణ అయింది.

వివరాల్లోకి వెళితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నీరసంగా అనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా తనకు కరోనా ఉన్నట్లు నిర్దారణ అయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు,తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.

ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.  అమిత్ షా, అర్జున్ మేఘ్వాల్,ధర్మేంద్ర ప్రధాన్, శ్రీపాద్ నాయక్,సతీష్ మహనా, సిద్దార్థ్ నాథ్ సింగ్ మొదలైనవారికి కరోనా వైరస్ సోకింది. వీరిలో కొందరు కోలుకున్నారు కూడా.