iDreamPost
android-app
ios-app

నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ ?

  • Published Jul 01, 2020 | 6:18 AM Updated Updated Jul 01, 2020 | 6:18 AM
నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ ?

రెండేళ్లకు పైగా గ్యాప్ కు న్యాయం చేకూరుస్తూ భీష్మ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ పెళ్లి ఘడియల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించపోయి ఉంటే దుబాయ్ లో ఏప్రిల్ 16న అంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయి ఉండేది. ఆ మేరకు అంతకుముందే ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు కూడా. కానీ లాక్ డౌన్ వల్ల అనూహ్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తాజా సమాచారం మేరకు కొత్త తేదీని ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది. జూలై 26న హైదరాబాద్ లోనే పరిమిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆహ్వానితుల మధ్య వేడుక జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.

కానీ ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. భాగ్యనగరంలో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉండటంతో వేచి చూసి అప్పుడు ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారట. నిఖిల్ కూడా ఇదే తరహాలో సింపుల్ గా వెడ్డింగ్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా ఇదే బాట పడుతున్నారు. రానా సైతం ఇదే దారిలో వెళ్ళక తప్పేలా లేదు. ప్రస్తుతం నితిన్ రంగ్ దే పూర్తి చేయాల్సి ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకో ఇరవై శాతం దాకా బాలన్స్ ఉన్నట్టు వినికిడి. షూటింగులకు వాతావరణం ఇంకా అనుకూలంగా లేకపోవడంతో రంగ్ దే టీమ్ వేచి చూస్తోంది.

ఫారిన్ లో ప్లాన్ చేసిన కొంత భాగం పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడే పూర్తిచేసేలా ప్లానింగ్ జరుగుతోంది. దీని తర్వాత మేర్లపాక గాంధీ, చంద్రశేఖర్ యేలేటి, కృష్ణ చైతన్య ఇలా వరసగా డైరెక్టర్లకు కమిట్ అయిన నితిన్ రానున్న రోజుల్లో చాలా బిజీగా మారబోతున్నాడు. ఇలా ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు సెట్ చేసుకున్న యూత్ హీరో నితిన్ ఒక్కడే అని చెప్పొచ్చు. వీటి సంగతలా ఉంచితే నితిన్ ని కొత్త పెళ్లి కొడుకుగా చూడాలనుకుంటున్న అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేసేలా త్వరలోనే ఆ సుముహూర్తం గురించి చెబుతారేమో.